Begin typing your search above and press return to search.
బీజేపీ అంటే బిర్యానీ కాదు.. నువ్వు రెండో సారి సీఎంవి.. నేను నాలుగోసారి!
By: Tupaki Desk | 8 Jan 2022 4:36 AM GMTతెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేసిన వైనం పై బీజేపీ అధిష్ఠానం ఎంత సీరియస్ గా ఉందన్న విషయాన్ని తెలియజేసేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. హైదరబాద్ లో జరుగుతున్న సంఘ్ పరివార్ తో పాటు.. పలు హిందూ సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న ప్రముఖులు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాటల్ని తూటాల్లా విసురుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్ కు వచ్చారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సీఎంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక విధంగా చెప్పాలంటే.. సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి.. ఇంత తీవ్రంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకు ముందెప్పుడూ విరుచుకుపడలేదేమో? అంతేకాదు.. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి మాత్రమే అంటూ కేసీఆర్ తన కంటే ఎంత చిన్నోడన్న విషయాన్ని శివరాజ్ సింగ్ వ్యాఖ్యానించటం గమనార్హం. తానునాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశానని గుర్తు చేశారు. కేసీఆర్ దమ్మున్నోడు అనుకున్నానని.. కానీ ఇంత పిరికివాడని మాత్రం అనుకోలేదన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను జైల్లో పెట్టాడంటే.. ఎంత భయపడ్డాడో అర్థమవుతుందన్న ఆయన.. శ్రీక్రిష్ణుడు కూడా జైల్లోనే పుట్టాడని.. కానీ కంసుడ్ని ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ కూడా కంసుడిలానే భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అన్యాయ పాలనను నిప్పు పెట్టే వరకు విడిచి పెట్టమన్న ఆయన.. తమ పార్టీ నేతలపై లాఠీ ఝుళిపిస్తావా?.. నిన్ను అంత తేలిగ్గా విడిచిపెట్టమన్నారు.
‘బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నావా.. తినటానికి. పొట్టను చీల్చుకుంటూ వస్తాం కేసీఆర్’ అంటూ ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. బిడ్డ ఎమ్మెల్సీ.. అల్లుడు మంత్రి.. ఇంకా ఎవరన్న ఉంటే వారిని కూడా ఏదో ఒకటి చేసేస్తాడంటూ ఎద్దేవాచేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. నిరుద్యోగ భ్రతి.. దళితులకు మూడు ఎకరాల భూమి.. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇచ్చావా? అని ప్రశ్నించారు. నువ్వొక భయపడే ముఖ్యమంత్రి అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు.