Begin typing your search above and press return to search.
జగన్ పై మోడీషాల గుర్రు..తాజా వ్యాఖ్యలే నిదర్శనమట!
By: Tupaki Desk | 15 July 2019 4:27 AMఒక దేశం.. ఒక పార్టీ పేరుతో దుర్మార్గపు రాజకీయాలకు తెర తీసిన బీజేపీ దుష్ట దుర్మార్గ కన్ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద పడిందా? చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న జగన్ కు ఏపీ ప్రజలు ఎంతలా నీరాజనాలు పలుకుతున్న విషయం తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటును సొంతం చేసుకోలేని బీజేపీ.. ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా మాట్లాడిన తాజా మాటలు చూస్తుంటే.. జగన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే కుట్రకు తెర తీశారా? అన్న సందేహం కలుగక మానదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాలన తేవటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ పెద్దలు.. అందుకు తగ్గట్లే పదవుల కోసం.. అధికారం కోసం తపించే వారిని తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా వాపును బలుపుగా భావిస్తున్న తీరు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని చెప్పక తప్పదు. మైకు వీరుల్ని వెంటేసుకొని.. ప్రెస్ మీట్ పెట్టేసి.. రాష్ట్రంలో అలా చేస్తాం.. ఇలా చేస్తామన్న బడాయి మాటలే తప్పించి.. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా హామీని ఇవ్వలేని మోడీ బానిసలు జగన్ మీద విమర్శనాస్త్రాలు సంధించటం షురూ చేశారు.
జగన్ ప్రభుత్వం పవర్లోకి వచ్చి నెలన్నర మాత్రమే అయిన వాస్తవం తెలిసినప్పటికి.. అంతకంతకూ పెరిగిపోతున్న జగన్ గ్రాఫ్ ను ఏదోలా డ్యామేజ్ చేయాలన్న తపన వారిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని చెప్పక తప్పదు. తాజాగా ఏపీకి వచ్చిన బీజేపీ నేతలంతా జగన్ సర్కారును టార్గెట్ చేయటం చూస్తే..మరో కొత్త దుర్మార్గానికి బీజేపీ అగ్ర నేతలు తెర తీశారా? అన్న సందేహం కలుగక మానదు.
ఏదైనా కుక్కను చంపాలనుకుంటే.. ముందు దాని మీద మరకలేయటం.. అనుమానాలు కలిగేలా చేయటం.. అది పిచ్చికుక్క అన్న ప్రచారం చేసి చంపేసే దుర్మార్గపు ప్లాన్ ను తాజాగా తెర మీదకు తెచ్చినట్లుగా కనిపించక మానదు. మంత్రివర్గ ఏర్పాటు మొదలు.. ఏ విషయంలో అయినా.. తన సామాజిక వర్గానికంటే కూడా సమన్యాయం పాటిస్తూ.. అభినందనలు అందుకుంటున్న జగన్ పై విష ప్రచారాన్ని షురూ చేశారు. ఇందులో భాగంగా కులం మరకను జగన్ కు అంటించే ప్రయత్నం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వం మాదిరే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని.. గత ప్రభుత్వం మాదిరే జగన్ సైతం ఒకే కులానికి ప్రాధాన్యమిస్తున్నట్లుగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం కాక మానదు. జగన్ కూ చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందన్న హెచ్చరిక అసలు రహస్యం.. ఏపీ ప్రత్యేక హోదా మాట ఎత్తితే అంతే సంగతులన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి తనకు అవకాశం వచ్చిన ప్రతి వేదిక మీదా.. ఏపీ ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తున్న జగన్ ను నిలువరించే ప్రయత్నంలో భాగమే తాజా దుర్మార్గపు వ్యాఖ్యలుగా చెబుతున్నారు.
అధికారం చేపట్టిన నెలన్నర వ్యవధిలోనే జగన్ కు కులాన్ని ఆపాదించటం చూస్తే.. రానున్న రోజుల్లో కులం పేరుతోనే కుట్ర పన్నిన్నట్లుగా అనుమానం కలుగక మానదు. గుంటూరులో నిర్వహించిన పార్టీ పదాధికారుల ముగింపు సభలోనూ.. మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ జగన్ ను టార్గెట్ చేసేలా వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పార్టీనే లేని ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు పాతిక లక్షలు దాటిస్తామన్న బడాయి మాటల్ని చూస్తేనే.. బీజేపీ నేతల వ్యవహరం భజన బృందాన్ని తలపించేలా ఉందని చెప్పక తప్పదు.