Begin typing your search above and press return to search.

వివాదంలో చిక్కుకున్న బీజేపీ సీఎం

By:  Tupaki Desk   |   22 Aug 2016 6:11 AM GMT
వివాదంలో చిక్కుకున్న బీజేపీ సీఎం
X
రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉత్తర భారతంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మధ్యప్రదేశ్ - బీహార్ - రాజస్థాన్ - ఉత్తరాఖండ్ అసోం - పశ్చిమబెంగాల్ - ఉత్తరప్రదేశ్ ల‌లో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్నాయి.ఇప్ప‌టివ‌ర‌కు వర్షాల ధాటికి దాదాపు 30 మంది చనిపోయారు. అయితే బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ వివాదంలో ప‌డ్డారు. త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా పోలీసుల భుజాల మీద ఎక్కి ఆయ‌న చిన్న చెరువును దాటారు.

ప‌న్నా జిల్లాలోని అమన్‌ గంజ్ ప్రాంతంలో శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ పర్యటించేందుకు వెళ్లారు. మోకాళ్ల వ‌ర‌కు కూడా నీళ్లు లేని ఓ వ‌ర‌ద ప్ర‌వాహాన్ని దాటుకునేందుకు సీఎం పోలీసుల స‌హాయాన్ని తీసుకున్నారు. వారి భుజాల‌పై చేతులు వేసి ఆ చిన్న వ‌ర‌ద ప్ర‌వాహాన్ని దాటేశారు. ఈ ఫొటో మీడియాకు చిక్కి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారింది. చిన్న‌పాటి ప్ర‌వాహాన్ని దాట‌కుండా సీఎం గారు పోలీసుల‌తో మొయించుకుంటూ వెళ్ల‌డం ఏంట‌ని ప‌లువురు మండిప‌డుతున్నారు. స‌హ‌జంగానే ప్ర‌తిప‌క్షాలు సీఎం తీరుపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే అధికారులు మాత్రం వివాదాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేశారు. నీళ్ల‌లో విష‌కీట‌కాలుంటే స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌నే ఉద్దేశంతో ఈ విధంగా చేశామ‌ని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉండ‌గా గంగానది మహోగ్రరూపం దాల్చడంతో బీహార్ - ఉత్తరప్రదేశ్ - పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. రుతుపవనాల ప్రభావంతో కూడా భారీ వర్షాలు కురవ‌డంతో మధ్యప్రదేశ్‌ ను భారీ వర‌ద‌లు ముంచెత్తాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాల్లోకి వరద నీరు వచ్చిచేరింది. వర్షాలు - వరదలకు పలు దేవాలయాలు నీట మునిగిపోయాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకునేందుకు హెలికాప్టర్ల ద్వారా ఆహారపొట్లాలు - మందులను జారవిడుస్తున్నారు. రేవా జిల్లా కలెక్టర్ రాహుల్ జైన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు పునరావాసం - రోగాలు బారినపడకుండా మందులను పంపిణీ చేశారు. సాగర్‌జిల్లాలో కురిసిన వర్షానికి ఓ ఇల్లు కూలిన ఘటనలో ఏడుగురు చనిపోయారు. వీరిలో ఒక మహిళ - నలుగురు చిన్నారులు ఉన్నారు. జీపులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రాయిసన్ జిల్లాలోని ఓ బ్రిడ్జి దాటుతుండగా వరద ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయారు.