Begin typing your search above and press return to search.
మోడీ భవిష్యత్తుకు సేనతో పెనుగండం!
By: Tupaki Desk | 21 Sep 2015 4:18 AM GMTప్రస్తుత ప్రధాని నరేంద్రమోడీ చాలా సుదీర్ఘమైన రాజకీయ భవష్యత్ ఆలోచనలతోనే ఉన్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. కేవలం ఈ అయిదేళ్ల టర్మ్ అధికారం వెలగబెట్టడం కాదు.. చాలాకాలం పాటూ భాజపాను అధికారంలో ఉంచగల పటిష్టమైన స్కెచ్ వేయడం అనేది తన ప్లాన్ గా ఆయన విధాన నిర్ణయాలు తీసుకుంటున్నాడని.. జాగ్రత్తగా గమనించిన ఎవరైనా వ్యాఖ్యానిస్తారు. అయితే ముందుముందు ఆయన మరియు ఆయన నేతృత్వం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ, అలాగే ఆయనను వెనకనుంచి నడిపిస్తున్న ఆరెస్సెస్ ఇవన్నీ గనుక.. తమ హిందూత్వ ఎజెండాను కొద్దిగానైనా మార్చుకోకపోతే.. రకరకాల చిక్కులు వచ్చేలా కనిపిస్తున్నది. ప్రధానంగా భాజపా కేవలం ఈ ఒక్క హిందూత్వ ఎజెండాకు మాత్రమే పరిమితమై ముందుకెళ్తుంటే గనుక.. వారికిది హెచ్చరికే. ప్రస్తుతానికి ఎన్డీయేలో భాగస్వామిగానే ఉన్నటువంటి శివసేన నుంచి వారికి పెనుముప్పు పొంచిఉన్నట్లే లెక్క.
భాజపా- శివసేన ఇద్దరిదీ ఒకటే హిందూత్వ ఎజెండా అయినప్పుడు.. ఎవరు ఎక్కువమంది హిందువులను ఆకర్షిస్తారనే విషయం ఇంపార్టెంట్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి ఇద్దరూ కలసి పోటీచేస్తున్నారు గనుక.. ఇబ్బంది లేదు. అదే మొన్నటికి మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో విడివిడిగా పోటీచేశారు. మోడీ బ్యాచ్ ఎక్కువ సీట్లు సాధించింది. అక్కడ ప్రత్యర్థి బలహీనుడు గనుక ఓకే. కానీ ఇప్పుడు బీహార్ పరిస్థితి కూడా అలాగే ఉంటుందా? బీహార్ లో ప్రత్యర్థి బలమైన వాడు.. శివసేన చీల్చే హిందూత్వ ఓట్లు... భాజపాను దెబ్బతీయకుండా ఉంటాయా? అనేది చాలా ముఖ్యమైన పాయింట్ అయిపోయింది. ప్రస్తుతానికి బీహార్ లో శివసేనకు సంస్థాగతమైన పార్టీ కేడర్ లేకపోవడం వల్ల ఫలితం పెద్దగా కనిపించకపోవచ్చు. కానీ.. భాజపాతో సంబంధంలేకుండా.. హిందీ మాట్లాడే రాష్ట్రాలన్నిటిలోనూ తాము స్వతంత్రంగా ఎదగాలని అనుకుంటున్నట్లు శివసేన నాయకులు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నారు.
అదే నిజమైతే గనుక.. భాజపాకు ముందుముందు పెనుగండం పొంచి ఉన్నట్లే. శివసేన కేవలం హిందూత్వ ఎజెండాను పట్టుకునే ముందుకువెళుతుంది. అదే సమయంలో భాజపా హిందూత్వతోపాటూ ఓటు బ్యాంకు రాజకీయాలను కూడా విధిగా ఆశ్రయిస్తుంది. ఈ తేడా.. వారికి ఉండే ఆదరణను మార్చేయవచ్చు. భాజపా కనీసం రాబోయే రోజుల్లో అయినా.. కేవలం హిందూత్వతో ముడిపడినది మాత్రమే కాకుండా.. లౌకిక సంక్షేమ ఎజెండాను కూడా భుజానికెత్తుకునే.. కొత్త ఇమేజితో ప్రజల్లోకి వెళితే తప్ప.. మనుగడను సుస్థిరం చేసుకోవడం సాధ్యం కాదు అని పలువురు విశ్లేషిస్తున్నారు.