Begin typing your search above and press return to search.

మిత్ర‌ప‌క్షంపై పోస్టర్ల యుద్ధం

By:  Tupaki Desk   |   12 Jun 2016 4:42 PM IST
మిత్ర‌ప‌క్షంపై పోస్టర్ల యుద్ధం
X
బీజేపీ మిత్రపక్షమైన శివసేన పార్టీ క‌మ‌ల‌దళంపై విమర్శల జోరు పెంచింది. పార్టీ అధికార ప‌త్రిక‌ సామ్నాలో సంపాదకీయాలు బీజేపీ సర్కారుకు, ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోదీకి చురకలు అంటించడం మామూలే. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసిన శివ‌సేన పోస్టర్ల యుద్ధానికి తెరతీసింది. మోదీని - బీజేపీని ఉతికి ఆరేస్తూ వరుస పోస్టర్లతో కలకలం సృష్టిస్తోంది. అది కూడా ఆన్‌లైన్‌లో చెల‌రేగి పోతూ బీజేపీకి ప‌క్క‌లో బ‌ల్లెంలాగా మారింది.

ఎన్నికల ముందు..తర్వాత అనే థీమ్‌ తో వేసిన పోస్టర్‌ లో "రైతుకు ఉరితాడే దిక్కు" అన్న సందేశం చేర్చారు. రుణాల గురించి చెప్పేది ఒకటి.. వాస్తవ పరిస్థితి మరొలాఉందని మరో పోస్టర్‌ లో సర్కారును చెండాడారు. ఇక స్వచ్ఛ్ భారత్‌ లో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన టాయిలెట్ల నిర్మాణం అంతకంతకూ తగ్గడాన్ని మరో పోస్టర్‌ లో వేలెత్తి చూపారు. మహిళలపై నేరాలు పెరిగాయని, బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్ సమక్షంలో ఓ అమ్మాయిని జీన్‌ ప్యాంటు బటన్ ఒపెన్ చేయించారని ఇంకో పోస్టర్‌ లో దుయ్యబట్టారు. పెట్రో ధరల పెంపు - పథకాల పేర్ల మార్పుపై ఇతర పోస్టర్లు రూపొందాయి. రాబోయే ఏడాది ముంబై పుర‌పాల‌క సంఘానికి ఎన్నిక‌లు ఉన్న‌ప్ప‌టికీ ఆ వేడి ఏడాది ముందే ప్రారంభం అయింద‌ని మ‌రాఠాలో జోరుగా చ‌ర్చ సాగుతోంది.