Begin typing your search above and press return to search.
మిత్రుడి సలహాతో మోడీ మునుగుడా? తేలుడా?
By: Tupaki Desk | 5 Dec 2015 9:11 AM GMTజిగిరీ దోస్త్ లాంటి శివసేన మద్దుతు పోగొట్టుకున్న బీజేపీ చాలానే ఇబ్బందులు పడుతోంది. రాజకీయంగా తిరుగులేని విధంగా ఉన్నప్పటికీ.. కొన్ని అంశాలకు సంబంధించి.. బలంగా తన వాదనను వినిపించే శివసేన మాట బీజేపీకి అండగా లేకపోవటం ఇబ్బందే. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రెండు పార్టీల మధ్య మొదలైన లొల్లి.. రోజురోజుకీ పెరుగుతుందే తప్పించి తగ్గటం లేదు.
ఈ నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య పలు అంశాల విషయంలో పంచాయితీ నడుస్తోంది. మిత్రుడి సహాయ నిరాకరణతో బీజేపీ కొన్ని అంశాల విషయంతో తన వాయిస్ ను బలంగా వినిపించలేక ఇబ్బంది పడుతోంది. మరోవైపు బీహార్ లో బీజేపీ దారుణ పరాభవంతో పాటు.. గుజరాత్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకోవటం బీజేపీకి చికాకు పుట్టించే అంశాలుగా చెప్పొచ్చు.
మోడీ మీదా.. ఆయన సర్కారు మీదా స్వదేశంలో విపక్షాలు విరుచుకుపడుతుంటే.. విదేశాల్లో మాత్రం ఆయన ఆదరణ పెరుగుతోంది. స్వదేశంలో ఆయనకు తగ్గుతున్న ఆదరణ విషయంలో శివసేన తాజాగా ఒక ఐడియా ఇచ్చింది. ఆ ఐడియా ఏమిటంటే.. ఇంతకాలం మోడీ అండ్ కో టచ్ చేయని రామ మందిర నిర్మాణ విషయాన్ని సీరియస్ గా తీసుకొని నిర్మాణం చేస్తే.. మోడీ సర్కారుకు బ్రహ్మాండమైన మద్ధతు లభిస్తుందన్న మాటను చెబుతోంది. తాజా సామ్నా సంచికలో శివసేన ఈ విషయంపై ఒక సంపాదకీయం రాసింది.
కరెంటు షాక్ కొట్టే రామాలయం అంశాన్ని మోడీ టచ్ చేయటమే కాదు.. టేకప్ చేసి సీరియస్ గా ఆ ఇష్యూను క్లోజ్ చేయాలన్న శివసేన చెబుతున్న మాట చూస్తుంటే.. మోడీని తేల్చే కన్నా.. మళ్లీ లేవకుండా ముంచేలా కనిపిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసహనం లాంటిది లేకుండానే దేశంలో అసహనం మీద రచ్చరచ్చ చేసిన విపక్షాలు.. అధికారపక్షం కానీ రామమందిరం అంశాన్ని కానీ టేకప్ చేస్తే.. ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదేమో.