Begin typing your search above and press return to search.

కోహ్లీ మేటి ఆటగాడు .. ప్రశంసిస్తూనే ఉంటా : అక్తర్

By:  Tupaki Desk   |   3 Sep 2020 12:12 PM GMT
కోహ్లీ మేటి ఆటగాడు .. ప్రశంసిస్తూనే ఉంటా : అక్తర్
X
విరాట్ కోహ్లీ .. ప్రస్తుతం క్రికెట్ టీం ఇండియా కీలక ఆటగాడు , కెప్టెన్. ఇండియన్ టీం పరుగుల యంత్రం. పిచ్ ఏదైనా , బౌలర్ ఎవరైనా ఒక్కసారి కోహ్లీ దిగనంతవరకే ..ఒన్స్ కోహ్లీ గ్రౌండ్ లో దిగితే ఏ ఫార్మట్ అయినా పరుగుల వరద పారాల్సిందే. ప్రపంచంలో ఉన్న మేటి బ్యాటమెన్స్ ఒకరిగా విరాట్ ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు సైతం కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తుంటారు. అలాగే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా వీలుచిక్కినప్పుడల్లా కోహ్లీ పై ప్రశంసలు కురిపిస్తుంటాడు. రాట్ కోహ్లీని ప్రశంసించడం తప్పేమీ కాదని , అలాంటి ఆటగాడు ప్రపంచ క్రికెట్‌లో ఎవరూ లేరని, అలాంటి ఆటగాడి ప్రతిభను పొగడడం తప్పెలా అవుతుందని అక్తర్ ప్రశ్నించాడు.

భారత ఆటగాళ్లు మాత్రమే కాదని, అంతర్జాతీయంగా ప్రతిభావంతుడైన ప్రతి ఆటగాడినీ తాను మెచ్చుకుంటానని , ఎప్పుడూ భారత క్రికెటర్లను ప్రశంసిస్తుంటాడంటూ షోయబ్ అక్తర్ పై పాక్ ‌లో విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న అక్తర్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు సాధించాడు. ఇంకా అతడికి ఎంతో కెరీర్ ఉంది. చిన్న వయసులోనే అన్ని సెంచరీలు సాధించి ప్రపంచ మేటి క్రికెటర్‌గా కోహ్లీ గుర్తింపు పొందాడు. పాకీస్తాన్‌ మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్‌లో ఏ ఆటగాడికీ అలాంటి ఘనత లేదు. అలాంటి ఆటగాడు ప్రతి ఒక్కరి ప్రశంసకూ అర్హుడు. భారతీయుడు అయినంతమాత్రాన కోహ్లీని ప్రశంసించకూడదనడం సరికాదు. అందుకే కోహ్లీని నేను ఎల్లప్పుడూ అభినందిస్తూనే ఉంటాను. ఎవరు ఏమనుకున్నా సరే..అంటూ చెప్పుకొచ్చాడు.