Begin typing your search above and press return to search.
నేను పరుగెత్తే రోజులు ముగిశాయి: రావల్పిండి ఎక్స్‌ప్రెస్
By: Tupaki Desk | 23 Nov 2021 2:30 AM GMTపాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కు ఏమైంది? ఆటలో కొనసాగినంత కాలం తన వేగంతో.. రిటైరయ్యాక తన క్రికెట్ విశ్లేషణతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అక్తర్ ‘‘నేనిక పరుగెత్తే రోజులు’’ ముగిశాయి అంటూ ప్రకటన చేయడం ఆశ్చర్య పరిచింది. అసలింతకూ ఏమైంది అక్తర్ కు...? గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన రావల్పిండి ఎక్స్ ప్రెస్ ఎందుకిలా ప్రకటన చేశాడు...? క్రికెట్ అభిమానులు.. విశ్లేషకులు.. ఇలా ఒకరేమిటి..? అందరిలోనూ ఇప్పుడు ఒకటే ఆలోచన.
ఎంతటి బ్యాట్స్ మన్ అయినా రావల్పిండి వేగానికి పిండి పిండే
అది 1999..అప్పటికి అక్తర్ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి రెండేళ్లయింది. అంతకుముందే వేగవంతమైన బౌలర్ గా పేరు తెచ్చుకున్న అక్తర్.. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం రావాల్సినంత పేరు రాలేదు. కానీ, ఆ ఒక్క బాల్ తో అతడేంటో ప్రపంచానికి తెలిసింది. 1999 లో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ల్ లో భారత్ తో జరిగిన టెస్టు మ్యాచ్ ఇందుకు వేదికైంది. నాటి మ్యాచ్ లో తొలుత రాహుల్ ద్రవిడ్ ను అవుట్ చేసిన అక్తర్, తర్వాతి బంతికే కళ్లు తిరిగే యార్కర్ తో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ వికెట్లను గిరాటేశాడు. అంతే.. అక్తర్ అంటే ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత పదేళ్లు అతడి బౌలింగ్ ప్రతిభను ప్రపంచమంతా గమనించింది.
ఆ రనప్ కే గుండెలదురు..
ఇప్పటి తరానికి అక్తర్ గురించి పైపైన తెలుసేమో గానీ.. 1990వ దశకం చివర్లో అతడిని టీవీల్లో చూసి యువత వెర్రెక్కిపోయేవారు. పొడవాటి జట్టు.. ఆరడుగుల ఎత్తయిన మనిషి.. బలమైన దేహం.. అందుకు తగ్గట్టే అతడి బౌలింగ్ రనప్. సుదీర్ఘంగా ఉండే అతడి రనప్ చూస్తేనే బ్యాట్స్ మన్ భయపడిపోయేవారంటేనే అతిశయోక్తి కాదు. అలా.. అలా.. ఓ పెద్ద అలలా అక్తర్ దూసుకొచ్చి.. బంతిని బుల్లెట్ లా సంధిస్తే పరుగులు సాధించడం పక్కనపెట్టి దానిని కాచుకోవడమే బ్యాట్స్ మన్ కు పెద్ద పని అయ్యేది.
మొదటి నుంచి గాయాల వీరుడే..
అక్తర్ అంటే వేగమే కాదు గాయాలూ కూడా. సహజంగా ఫాస్ట్ బౌలర్ అంటేనే గాయాలు. ఇక అత్యంత ఫాస్ట్ బౌలర్ అయితే చెప్పేదేముంది? అందుకనే అక్తర్ కు గాయాలు ఎక్కువ. దీనికితోడు ఫిట్ నెస్ పరంగా తీసుకోవాల్సినంతగా శ్రద్ధ తీసుకోకపోవడమూ ఇబ్బందిగా మారింది. ఓ దశలో అక్తర్ ఏ సిరీస్ కు అందుబాటులో ఉంటాడో.. దేనికి ఉండడో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతిభకు ఏమాత్రం లోటు లేకున్నా.. పాకిస్థాన్ క్రికెట్ అవలక్షణమైన క్రమశిక్షణ లోపం అక్తర్ లోనూ కనిపించేది. అయితే, పరిస్థితుల రీత్యా తప్పితే వ్యక్తిగతంగా అక్తర్ కు మంచివాడిగానే పేరుంది. మిగతా పాక్ క్రికెటర్లలా కాకుండా భారత్ అంటే సానుకూలంగానే ఉండేవాడు. భారత క్రికెటర్లతోనూ అక్తర్ కు మంచి సంబంధాలే ఉండేవి. ఉద్రేక పరుడైనప్పటికీ స్వతహాగా మంచి స్వభావి కావడంతో అక్తర్ కు మైదానం బయటా స్నేహితులు ఎక్కువే.
ఏమైందతనికి?
150 కిలోమీటర్ల వేగంతో బంతులను సంధించిన అక్తర్ కెరీర్ లో ఎన్నోసార్లు గాయపడ్డాడు. 1997లో అరంగేట్రం చేసినప్పటికీ.. 2007లోనే టెస్టులకు వీడ్కోలు చెప్పాడు. 2011 వరకు వన్డేలాడినా.. ఆ ఏడాది ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. అంటే.. మొత్తమ్మీద చూస్తే అక్తర్ అంతర్జాతీయ కెరీర్ పది, పదకొండేళ్లే. దీనికి ప్రధాన కారణం గాయాలే. కొన్నిసార్లు ఫామ్ లేమితో వేటు కూడా పడింది. కాగా, నాటి వేగమో, శరీర స్వభావమో.. 46 ఏళ్ల అక్తర్ ఇప్పుడు మోకాళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో ఆస్ట్రేలియాలోని మెల్ బోర్నలో అతడు సర్జరీ చేయించుకోనున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంటే.. ఇప్పుడిక కొన్నాళ్లు వెటరన్లు ఆడే ఫ్రెండ్లీ మ్యాచ్ ల్లోనూ అక్తర్ ను చూడలేకపోవచ్చు.
వార్తల్లోని వ్యక్తి
కెరీర్ కొనసాగినంత కాలం వార్తల్లో నిలిచిన అక్తర్.. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాల ద్వారానూ అభిమానులను అలరించాడు. వారి దేశ అధికారిక ఛానెల్ పీటీవీ స్పోర్ట్స్ యాంకర్ నౌమన్ నియాజ్‌తో వివాదం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఈ మాజీ ఫాస్ట్ బౌలర్ లైవ్ టీవీ షోలోనే తన రాజీనామాను ప్రకటించాడు. అయితే, ఆ తర్వాత యాంకర్ నౌమన్ నియాజ.. అక్తర్‌కు క్షమాపణలు చెప్పడంతో వివాదానికి తెర పడింది. కాగా, అక్తర్ 2011లో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. పాకిస్థాన్ తరఫున 46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 25.69 సగటుతో 178 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 24.97 సగటుతో 247 వికెట్లు తీశాడు. టి20ల్లో 22.73 సగటుతో 19 వికెట్లు సాధించాడు.