Begin typing your search above and press return to search.
జీవితంలోనే ఈరోజు దుర్ధినం.. ఉపాసన తల్లి ఆవేదన
By: Tupaki Desk | 11 April 2019 10:02 AM GMTఓటు వేసేందుకు ఏకంగా విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చింది. పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసేందుకు ప్రయత్నించగా ఓటు గల్లంతు అయ్యిందని అధికారులు బాంబు పేల్చారు. దీంతో హతాషురాలైంది అపోలో హాస్పిటల్స్ చీఫ్ ప్రతాప్ రెడ్డి కుమార్తె శోభనా కామినేని. విషయం తెలుసుకొని అధికారులపై మండిపడింది.
తాజాగా విదేశాల నుంచి ఓటేసేందుకు వచ్చిన శోభన కామినేని నగరంలోని ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కేంద్రానికి వెళ్లింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న ఆమె ఓటును లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి తొలగించారని సిబ్బంది తెలిపారు. దీంతో ఆమె పోలింగ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు
గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు వేసానని.. ఈ సారి తొలగిస్తారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత పౌరురాలిగా తనకిది విచారకరమైన రోజని. తాను భారత పౌరురాలిని కాదా.. అని ప్రశ్నించారు. నా జీవితంలోనే ఇదొక దుర్ధినం అని ఆమె మండిపడ్డారు. ఈ దేశంలో తన ఓటు ముఖ్యం కాదా అంటూ నిలదీశారు. పౌరురాలిగా తనకు జరిగిన అన్యాయాన్ని సహించనని స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో 17 లోక్ సభ సీట్లకు పోలింగ్ కొనసాగుతోంది.ప్రస్తుతం చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ శోభనా కామినేనికి సమీప బంధువు. ఆమె ఉత్సాహంగా ఓటు వేయడానికి రాగా.. ఓటు గల్లంతు కావడం విశేషం.