Begin typing your search above and press return to search.

షాక్ : గగనతలంలో హెలికాప్టర్ లోకి మరో 'విహంగం' ప్రవేశం

By:  Tupaki Desk   |   18 Oct 2020 11:30 PM GMT
షాక్ : గగనతలంలో హెలికాప్టర్ లోకి మరో విహంగం ప్రవేశం
X
విమానాలు కానీ హెలికాఫ్టర్లు కానీ గాల్లో ఉన్న సమయంలో వాటి రెక్కల్ని పక్షులు తాకిన ప్రమాదమే. అందుకే విమానాలు హెలికాప్టర్లు ఎగిరే సమయం లో పక్షులు అటుగా రాకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా పక్షి రెక్కల కు తగిలినా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కూలిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హెలికాప్టర్ లోకి ఓ గుడ్లగూబ అనుకోని అతిథిలా వచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా అది వైరల్ గా మారింది. దానిపై ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు చెలరేగి నెలల తరబడి అడవులు కాలిపోతున్న సంగతి తెలిసిందే.

ఈ మంటలను ఆర్పడానికి ఆ దేశ ప్రభుత్వం చేయని పని లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మంటలు మాత్రం అదుపులోకి రావడం లేదు. హెలికాప్టర్లను కూడా ఉపయోగించి మంటలను ఆర్పి పనులు చేపడుతున్నారు. ఈ పనులు చేపట్టే సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ పైలట్ హెలికాప్టర్ తో అడవిలో మంటలు ఆర్పుతుండగా అతడికి హెలికాప్టర్లో గుడ్లగూబ కనిపించింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో.. లోపలికి ఎలా చొరబడిందో అతడికి అంతుబట్టలేదు. అది హెలికాప్టర్లో ఎటు ఎగరకుండా కాసేపు కిటికీ దగ్గర అలా కూర్చుండిపోయింది. ఆ తర్వాత పైలెట్ డాన్ అల్వైనర్ తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి చూడగా అది అక్కడ కనిపించలేదు. అది ఎలా అమ్మాయి ఏమైంది కూడా అతడికి అంతుబట్టలేదు. గాల్లో ఎగురుతున్న హెలికాప్టర్ లోకి గుడ్లగూబ ప్రవేశించడం ఒక వింత అయితే.. అది అకస్మాత్తుగా మళ్లీ కనిపించకుండా పోవడం మరో అరుదైన ఘటనగా చెబుతున్నారు. ఈ వింత గురించి స్కై ఏవీయేషన్ ఫేస్బుక్ ద్వారా వెల్లడించగా అంతా ఆశ్చర్యపోతున్నారు.