Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు భారీ షాక్.. అదే జరిగితే చుక్కలే

By:  Tupaki Desk   |   3 Sep 2022 5:12 AM GMT
జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు భారీ షాక్.. అదే జరిగితే చుక్కలే
X
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఉదంతానికి సంబంధించి కీలక మలుపు తిరగనుంది. ఈ కేసులో ఒకరు తప్పించి మిగిలిన వారంతా మైనర్లు కావటం తెలిసిందే. పబ్ కు వచ్చిన అమ్మాయిని మాయమాటలు చెప్పి.. స్నేహపూర్వకంగా ఉన్నట్లు నటించి.. ఆమెను బేకరీ కి తీసుకెళ్లటం.. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడటం.. ఈ దారుణం నాటకీయ పరిణామాల మధ్య బయటకు రావటం తెలిసిందే.

నిందితుల్లో పలువురు పొలిటికల్ తో పాటు.. హై ప్రొఫైల్ కు చెందిన వారి పిల్లలు ఉండటంతో దీనిపై మరింత ఆసక్తి వ్యక్తమైంది. ఈ దారుణంలో పాల్గొన్న వారిలో పలువురు మైనర్ల అన్న విషయం తెలిసిందే. దీంతో వారిని జువైనల్ హోం కు తరలించారు. హోంలో ఉండగా వారి మైనార్టీ తీరటం.. ప్రస్తుతం వారు మేజర్లు అయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ.. వారు చేసిన నేరాన్ని జువైనల్ న్యాయస్థానంలో విచారణ జరపకుండా సాధారణ కోర్టులో విచారణ జరిగేలా చేయాలన్న ప్రయత్నాలు సాగుతున్నాయి.

దీనికి సంబంధించిన సమగ్రఆధారాల్ని హైదరాబాద్ కమిషనరేట్ పోలీసులు కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు. ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలని కోరుతూ జువెనైల్ జస్టిస్ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నాయి.

పోలీసుల ప్రయత్నాలు ఫలించి.. నిందితుల విచారణ జువెనైల్ హోం కాకుండా సాధారణ కోర్టులో జరిగితే.. వారికి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు. నిందితుల చర్య క్రూరమైనది పేర్కొంటూ గతంలోనే పోలీసులు జేజే బోర్డును ఆశ్రయించారు.

సాధారణంగా 16 ఏళ్లు దాటిన బాలలు క్రూరమైన నేరాలకు పాల్పడితే వారిని మేజర్లుగా పరిగణించి సాధారణ కోర్టులో విచారణ చేయించే వీలుంది. హైదరాబాద్ నగర పోలీసులు ఇప్పుడు ఆ విధానాన్ని ఫాలో కావాలని భావిస్తున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.