Begin typing your search above and press return to search.

జనసేనకి మరో షాక్..అసహనంలో పవన్ కళ్యాణ్!

By:  Tupaki Desk   |   13 March 2020 1:07 PM GMT
జనసేనకి మరో షాక్..అసహనంలో పవన్ కళ్యాణ్!
X
మరికొద్ది రోజుల్లోనే జనసేన పార్టీ 6 వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోబోతుంది. పవన్ కల్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ఈ మార్చి 14వ తేదీన ఆ పార్టీ ఆరో వార్షికోత్సవం పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉంది. గతం లో ఈ వేడుకను ఎంతో ఆర్భాటంగా, అన్ని హంగుల తో జరుపుకున్నారు. 2018లో రాజమండ్రి వేదికగా - 2019లో గుంటూరు వేదికగాను జనసేన ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అదే విధంగా ఈసారి కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో చేస్తామని ప్రకటించారు.

అయితే, ప్రస్తుతం ఏపీలో స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీనితో ఈసారి ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు చేద్దాం అనుకున్న కార్యకర్తలు షాక్ లో ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సింపుల్‌ గా నిర్వహించాలని డిసైడయ్యారు. ఎప్పుడైనా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటే 144 సెక్షన్ తో పాటుగా… పార్టీ పరంగా బహిరంగ సభలు చేపట్టినా షరతులు పాటించాల్సి ఉంటుంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రధానంగా ఎనిమిది అంశాల తో ముడిపడి ఉంటుంది. వాటిల్లో పార్టీలు - నేతలు, అభ్యర్థులు చేసే ప్రసంగాలు, సభలు-సమావేశాలు - ఊరేగింపులు-ర్యాలీలు - పోలింగ్‌ రోజున ఆంక్షలు - పోలింగ్‌ బూతుల్లో ఆంక్షలు - పర్యవేక్షకుల నియామకం, అధికారంలో ఉన్న పార్టీకి నిబంధనలు - ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఉంటాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం - రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు. అధికార పార్టీలు కొత్త పథకాలను, ప్రాజెక్టులను - విధానాలను ప్రకటించకూడదు. ప్రభుత్వ ఖర్చులతో మీడియా, ఇతర మాధ్యమాల్లో ఇచ్చే ప్రకటనలపై నిషేధం ఉంటుంది.

జనసేన బీజేపీ పొత్తుకట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని గద్దె దించడమే అని ప్రకటించాయి. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లో పెంచి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని పార్టీ కార్యకర్తలకు సూచనలు కూడా చేసాయి. దీనిని ఇంకా ఉదృతంగా తీసుకెళ్లడానికి జనసేన ఆవిర్భావ సభనే వేదికగా మలుచుకోవాలని పథకాన్ని కూడా రచించుకుంది. ఒకవేళ జనసేన బహిరంగ సభ నిర్వహిస్తే.. సభకు పెట్టిన ఖర్చు మొత్తాన్ని పార్టీ తరుపున పోటీ చేస్తున్న నాయకుల ఖాతాలో జమ చేస్తుంది. కానీ ఎన్నికల కోడ్ కారణంగా ఆ అవకాశం జనసేనకి లేదు. ఇకపోతే ఈసారి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రెండు రోజులపాటు స్థానిక సమస్యలు - జాతీయభావాలపై పోరాటం చేసే ధోరణిలోనే వెళ్లనున్నారు. నాగరికతకు పుట్టినిల్లయిన నదులను విషమయం చేసుకోవడం బాధాకరమన్న కళ్యాణ్ వీటి పైనే రెండురోజులు పాటు దృష్టి సారించనున్నారు.