Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్

By:  Tupaki Desk   |   6 Sep 2021 11:30 AM GMT
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి షాక్
X
ఇంటర్మీడియెట్ ఆన్ లైన్ అడ్మిషన్లలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.. ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ సంవత్సరం డైరెక్ట్ అడ్మిషన్లను తీసుకోవడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు

ప్రస్తుత విద్యాసంవత్సరానికి యథావిధిగా అడ్మిషన్లు కొనసాగించాలని న్యాయస్థానం ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్లను అందరి అభిప్రాయాలు తీసుకొని ఆన్ లైన్ లో నిర్వహించవచ్చని హైకోర్టు సూచించింది. ఈ విద్యాసంవత్సరానికి గతంలో మాదిరిగా అడ్మిషన్లు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

ఇంటర్మీడియెట్ లో ఆన్ లైన్ అడ్మిషన్లకు రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 13 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ కళాశాలలన్నింటిలోనూ ఆన్ లైన్ ప్రవేశాలు ఉంటాయని.. ఇందులో రిజర్వేషన్లు వర్తిస్తాయంటూ ఇంటర్ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

తొలివిడత ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వివరాలు ఇంటర్ బోర్డు వెబ్ సైట్ అందుబాటులో ఉంచారు. దరఖాస్తు ఫీజుగా ఓసీ, బీసీలు రూ.100, మిగతా వర్గాల వారు రూ.50 చెల్లించాలని పేర్కొన్నారు. రెగ్యులర్ ఓకేషనల్ కోర్టుల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

వివరాలకు bie.ap.gov.in/ వెబ్ సైట్లో లేదా 18002749868లో సంప్రదించాలని సూచించారు.