Begin typing your search above and press return to search.
ఏపీ సర్కారుకు హైకోర్టు మరో షాక్
By: Tupaki Desk | 18 Oct 2016 6:03 PM GMTఏపీలోని చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నుంచి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్విస్ ఛాలెంజ్ విషయంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న ప్రభుత్వం ఈ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఇక, ఇప్పుడు సదావర్తి భూముల విషయంలోనూ హైకోర్టు నుంచి పెద్ద షాక్ తగిలింది. ఈ సత్రం భూములకు సంబంధించి వేలంలో కొనుగోలు దారులకు సేల్ డీడ్ ఇవ్వరాదని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రభుత్వం వేచి ఉండాలని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వం తరఫున అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం చంద్రబాబు ప్రభుత్వానికి షాక్ గానే పరిణమించనుందనేది విశ్లేషకుల అంచనా.
ఇక, విషయంలోకి వెళ్లిపోతే, 83 ఎకరాల సదావర్తి భూములను ఎలాంటి కనీస నిబంధనలు పాటించకుండానే చంద్రబాబు ప్రభుత్వం వేలం ప్రక్రియ నిర్వహించిందన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిని బినామీల పేరుతో చంద్రబాబు తనయుడు లోకేష్ కోనుగోలు చేయించారని వైకాపా నేతలు పెద్త ఎత్తున ఆరోపించారు. చెన్నై సమీపంలో రూ.1,000 కోట్ల విలువైన 83.11 ఎకరాల సత్రం భూములను వేలంలో ఎకరా రూ.22 లక్షలకే టీడీపీ నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ బంధు మిత్రులు దక్కించుకున్నారని దీనివెనుక లోకేష్ ఉన్నారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అంతేకాదు వైకాపా నేత ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో చెన్నై వెళ్లి భూములను పరిశీలించి వచ్చారు. ఇక, అప్పట్లో ఈ విషయంపై స్పందించిన దేవాదాయ శాఖా మంత్రి మాణిక్యాల రావు.. భూముల వేలం విషయంలో ప్రభుత్వం పారదర్శకంగానే వ్యవహరించిందని చెప్పారు. అంతేకాకుండా.. ఎకరా రూ.22 లక్షల చొప్పున బిడ్డర్ కొనుగోలు చేశారని, ముందు రూ.50 లక్షలుగా నిర్ధారించామని, అయితే ఏ ఒక్కరూ ముందుకు రాలేదని చెప్పారు. ఇక ఇప్పుడు రూ. 22 లక్షలకి ఒక్కరూపాయి అదనంగా ఇచ్చినా .. వారికి ఈ భూములు అప్పగిస్తామని అన్నారు.
అయితే, దీనికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈ గొడవ అంతటితో సద్దు మణిగిందని అందరూ భావించారు. కానీ, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం.. ఈ భూముల వేలం వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. కొందరికి లబ్ధి చేకూర్చేందుకు మార్కెట్ విలువ కంటే తక్కువగా భూములు విక్రయించారని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారించిన హైకోర్టు తాజాగా సేల్ డీడ్ విషయంలో ప్రభుత్వానికి పైవిధంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాన్ని ఆళ్ల స్వాగతిస్తుండగా.. ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటనా రాలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/