Begin typing your search above and press return to search.
సదావర్తి.. బాబుకు దిమ్మ తిరిగే షాకిచ్చిందిగా?
By: Tupaki Desk | 4 July 2017 8:15 AM GMTసదావర్తి సత్రం భూములు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దిమ్మ తిరిగిపోయే షాక్ తగిలింది. గతంలో తాను అన్న మాటలే ఇప్పుడు ఆయన నోరు విప్పటానికి వీల్లేని విధంగా మార్చాయని చెప్పాలి. రూ.5కోట్ల కంటే ఎక్కువ ఇస్తే ఆ భూములు ఇస్తామని గతంలోనే చెప్పామని.. ఇప్పుడు రూ.5కోట్ల ఆదాయం ఎక్కువగా రావటం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి రూ.5 కోట్లు ఎక్కువగా చెల్లిస్తే వారికే ఆ భూముల్ని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు జగన్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా అంగీకారం తెలపటం అధికార పార్టీకి షాకింగ్ గా మారింది.
ఆళ్ల ఆంగీకారాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు రూ.5కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఆళ్లకు నాలుగు వారాలు అనుమతి ఇచ్చిన వైనంపై ఏపీ సర్కారుకు ఊహించని షాక్ తగిలిందని చెప్ప తప్పదు. కోట్లాది రూపాయిలు విలువ చేసే సదావర్తి భూముల్ని అయిన వారికి కారుచౌకగా కట్టబెట్టిన బాబు సర్కారుకు తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు షాకింగ్ గా మారాయని చెప్పక తప్పదు. రూ.5కోట్ల మొత్తాన్ని తాను చెల్లించే పరిస్థితుల్లో లేకున్నా.. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు తనకు తెలిసిన వారు సిద్ధంగా ఉన్నట్లుగా ఆళ్ల కోర్టుకు తెలిపారు.
రూ.5కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని ఆయన హైకోర్టుకు తెలిపారు. ఈ ఊహించని పరిణామం ఏపీ సర్కారుకు షాక్ కు గురి చేసిందని చెప్పక తప్పదు. దాని నుంచి తేరుకునే లోపే.. నాలుగు వారాల గడువు ఇస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకోవటంతో.. బాబు సర్కారుకు దిక్కుతోచని పరిస్థితిగా మారిందని చెప్పకతప్పదు. ఎందుకంటే తనకు తానుగా రూ.5కోట్ల మొత్తాన్ని అదనంగా ఇస్తే భూములు ఇచ్చేస్తానని చెప్పిన తర్వాత ఆ మాటకు తగ్గట్లే అప్పజెప్పాల్సి ఉంటుంది. ఆళ్ల చెప్పినట్లుగా రూ.27.44 కోట్ల కడితే 83 ఎకరాల భూమిని సదరు వ్యక్తికి అప్పజెప్పాల్సి ఉంటుంది. అదే జరిగితే వేలాది కోట్ల రూపాయిల విలువైన భూములు జారిపోవటం ఖాయమని చెప్పక తప్పదు. అత్యంత విలువైన భూములు తమ వారికి కట్టబెట్టాలనుకున్నవి కాస్తా ఇప్పుడు చేజారిపోవటానికి మించిన షాక్.. ఏపీ సర్కారుకు ఇంకేం ఉంటుందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/