Begin typing your search above and press return to search.

అమరావతిలోనూ వైసీపీనే.. మూడు రాజధానులకు జై.. బాబు ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   14 March 2021 9:21 AM GMT
అమరావతిలోనూ వైసీపీనే.. మూడు రాజధానులకు జై.. బాబు ఏం చేస్తారు?
X
ఏపీ మొత్తం వైసీపీ గాలి వీచినా అమరావతి పరిధిలోని గుంటూరు, విజయవాడలో మాత్రం టీడీపీ గెలుస్తుందని.. ఇక్కడి ఎన్నికలు రెఫరెండం అని చంద్రబాబు అన్నారు. గుంటూరులో వైసీపీ గెలిస్తే అమరావతిని ఎక్కడికైనా మార్చుకోవచ్చంటూ చంద్రబాబు సవాల్ చేశారు. అమరావతి కోసం పెద్ద ఉద్యమమే చేశారు. ఈ క్రమంలోనే గుంటూరులో కూడా వైసీపీ గెలవడం ఇప్పుడు టీడీపీకి, చంద్రబాబుకు షాకింగ్ లా మారింది. చంద్రబాబు నిరసనలకు స్వస్తి చెప్పి 3 రాజధానులకు ఓకే చెప్పాలని వైసీపీ నేతలు ఈ ఎన్నికల ఫలితాలతో డిమాండ్ చేస్తున్నారు.

ఏపీలోని అమరావతి పరిధిలో గల గుంటూరు, విజయవాడ కార్పొరేషన్లలో వైసీపీ విజయం సాధించడం సంచలనమైంది. దీన్ని బట్టి ఇక్కడి ప్రజలు సైతం మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయం తేటతెల్లమైంది. అమరావతి సెంటిమెంట్ లేదని.. చంద్రబాబు, రైతులు చేస్తున్నది ఒట్టి డ్రామా అని ప్రజా తీర్పుతో వెల్లడైందని వైసీపీ వర్గాలు అంటున్నారు. ఈ ఫలితం చూశాకైనా చంద్రబాబు అమరావతి జపం వీడి మూడు రాజధానులకు జై కొట్టాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ వ్యాప్తంగా వైసీపీ హవా కొనసాగింది. విజయవాడ, గుంటూరు మున్సిపాలిటీల్లోనూ అదే పునరావృతమైంది. దీన్ని బట్టి మూడు రాజధానుల ఏర్పాటుకు రాజధాని అమరావతి ప్రాంత ప్రజలు కూడా అంగీకరించారని తెలుస్తోంది. మొన్న పంచాయతీలు, నేడు మున్సిపల్ ఎన్నికలతో ఈ విషయం స్పష్టమైందని వైసీపీ నేతలు అంటున్నారు.

ఈ నేపథ్యంలో అమరావతి కోసం పోరాడుతున్న ఈ ప్రాంత రైతులు, చంద్రబాబు ఇక ఆ ఆందోళనను వదిలేసి సవాల్ చేసినట్టు మూడు రాజధానులకు మద్దతు తెలుపాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. మున్సిపల్ ఫలితాలు ముఖ్యంగా టీడీపీకి పెద్ద షాక్ లా పరిణమించాయి.