Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ ఓటర్లకు షాకిచ్చిన ఈసీ

By:  Tupaki Desk   |   29 Oct 2021 10:05 PM IST
హుజూరాబాద్ ఓటర్లకు షాకిచ్చిన ఈసీ
X
రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు ఈసీ షాకిచ్చింది. ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు పంచుతున్న వీడియోలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. దీనిపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఓటుకు నోటు వ్యవహారంపై ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పందించారు. ఈ సందర్భంగా శనివారం జరుగనున్న పోలింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఇక తమకు డబ్బులు పంచలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగా వచ్చి ఆందోళన చేపట్టిన ఓటర్లపై క్రిమినల్ కేసు పెడుతామని ప్రకటించారు. ఓటర్లకు డబ్బులు పంచినా ఓటర్లు డబ్బులు తీసుకున్నా నేరమే అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను పరిశీలించి డబ్బు అడిగిన వారిని గుర్తించి కేసుల పెడుతామని శశాంక్ హెచ్చరించారు.

దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ ఫీల్డ్ లెవల్ లో దర్యాప్తు చేస్తున్నారని.. ఒకవేళ డబ్బులు అడిగినట్లు తెలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తారని తెలిపారు.

డబ్బులు రాలేదని ఆందోళన చేయడం నేరమని శశాంక్ గోయల్ అన్నారు. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఓటుకోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామన్నారు. డబ్బులు అడిగినట్లు తేలితే క్రిమినల్ కేసులు పెడుతామని హెచ్చరించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని.. అందరూ నిర్భయంగా వచ్చి ఓటు వేయాలని సూచించారు.