Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్‌ కు షాక్..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే కి హైకోర్టు నిరాకరణ

By:  Tupaki Desk   |   3 Dec 2020 9:15 AM GMT
జగన్ సర్కార్‌ కు షాక్..స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే కి హైకోర్టు నిరాకరణ
X
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఫిబ్రవరిలో జరపాలని చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ణప్తిని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. స్టే ఇవ్వకుండా ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు అడ్డుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ హైకోర్టు విచారణ చేపట్టగా.. ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు.

మరోవైపు ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను ఎన్నికల సంఘం ఉల్లంఘించిందన్నారు. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా వ్యవహారిస్తుందని ఆరోపించందన్నారు. కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అన్నారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఎన్నికల సంఘం న్యాయవాది అశ్విన్ కుమార్ తిప్పికొట్టారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం మూడు సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రందించిందని కోర్టుకు తెలిపారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు బయటపడతాయనే సుప్రీం కోర్టును ఆశ్రయించకుండా హైకోర్టును ఆశ్రయించారని అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఏపీ ప్రభుత్వ విజ్ణప్తిని తోసిపుచ్చింది. అయితే ఇందుకు సంబంధించి సరికొత్త వాదనలు వినిపించేందుకు మరో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో కోర్టు ఈ కేసును రేపటికి వాయిదా వేసింది.