Begin typing your search above and press return to search.
పాత మాటే పక్కాగా చెప్పింది.. ‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం’
By: Tupaki Desk | 1 Dec 2021 7:38 AM GMTఎవరేం అనుకున్నా ఫర్లేదు.. తాము అనుకున్నదే నీతి.. ఇచ్చిన మాటకు.. చేసిన హామీని తుంగలో తొక్కేసి.. తాము అనుకున్న రీతిలో రాజకీయాల్ని నడపాలన్న భావన మొండుగా ఉండే కేంద్రంలోని మోడీ సర్కారు మరోసారి ఏపీ ప్రజలకు తాను చేసిన మోసాన్ని మరింత బాగా అర్థమయ్యేలా చేశారు.
ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన కేంద్రం.. తాజాగా మరోసారి పాత విషయాన్ని సరికొత్తగా చెప్పేశారు. విభజన నేపథ్యంలో ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశాన్ని మోడీ సర్కారు మొదట్లో ఓకే చెప్పి.. తర్వాత చేతులె ఎత్తేయటం తెలిసిందే.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని.. తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న మాటను చెప్పిన మోడీ అండ్.. పవర్లోకి వచ్చిన తర్వాత.. తమకు తిరుగులేని అధిక్యతను గుర్తించి హోదాను గంగలో కలిపేయటం తెలిసిందే. అప్పటినుంచి హోదా అంశాన్ని తరచూ తెర మీదకు తీసుకురావటం పరిపాటిగా మారింది. ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన ఈ అంశంపై తాజాగా మరోసారి ఏపీ ఎంపీ లోక్ సభలో ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా.. విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం అడిగినప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది. కాబట్టి 2015- 16 నుంచి 2019- 20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90: 10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించాం. 2015- 16 నుంచి 2019- 20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.’’ అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను ఇవ్వలేమన్న విషయాన్ని కేంద్రం మరోసారి లోక్ సభ సాక్షిగా స్పష్టం చేసింది. కావాలంటే ప్రత్యేక సాయం చేయటానికి మాత్రం అంగీకరించినట్లుగా వెల్లడించింది. విభజన చట్టంలోని చాలా అంశాలు అమలయ్యాయని.. మిగిలిన వాటికి మరికొంత సమయం పడుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధిస్తామన్నది తీరని కలగా మారటం ఖాయమన్న మాట కేంద్రమంత్రి చేసిన తాజా ప్రకటనను చూస్తే అర్థం కాక మానదు. చూస్తుంటే.. మళ్లీ కేంద్రం యూపీఏ సర్కారు అధికారంలోకి వస్తే కానీ.. ప్రత్యేక హోదా కల నెరవేరే అవకాశం ఉందని చెప్పక తప్పదు.