Begin typing your search above and press return to search.

వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీదకి దూసుకొచ్చిన వైసీపీ స్టూడెంట్ లీడర్!

By:  Tupaki Desk   |   1 Jun 2022 4:33 AM GMT
వైసీపీ జిల్లా అధ్యక్షుడి మీదకి దూసుకొచ్చిన వైసీపీ స్టూడెంట్ లీడర్!
X
సమయం.. సందర్భంగా చూసుకోకుండా కార్యక్రమాల్ని డిజైన్ చేస్తే ఎలాంటి తిప్పలు ఎదురవుతాయన్న విషయం తాజాగా ఏపీ అధికార పక్ష నేతలకు అర్థమవుతోంది. పార్టీ అధినేత కమ్ సీఎం జగన్ ఆర్డర్ తో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని చేపట్టిన అధికార పార్టీ నేతలకు అనూహ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

సమస్యల చిట్టాతో ప్రజలు అడిగేయటం ఒక ఎత్తు అయితే సొంత పార్టీకి చెందిన వారు సైతం కడిగేస్తున్న తీరుతో అధికారపక్ష నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి శివనగర్ లో స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కు చేదు అనుభవం ఎదురైంది.

ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీలో పర్యటిస్తున్న ఆయన్ను.. వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన నేత ఖుర్షీద్ నిలదీశారు. ఎన్నికల వేళలో ఎమ్మెల్యే గెలుపు కోసం తాను.. తన తోటి వారు చాలా కష్టపడ్డామని.. అలాంటిది ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి తమను పట్టించుకోవటం మానేసినట్లుగా ఖుర్షీద్ ఆరోపించారు.

ఎమ్మెల్యేను చూసినంతనే అతడు ఆవేశానికి గురై.. కేకలు వేస్తూ ఎమ్మెల్యే వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని అతి కష్టమ్మీదా నిలువరించారు.

ఈ సందర్భంగా ఆవేశానికి గురైన ఖుర్షీద్ తాను వైసీపీ విద్యార్థి విభాగానికి చెందిన యువకుడినని.. ఎన్నికల సమయంలో మధుసూదన్ గెలుపు కోసం తాను.. తన తోటి వారు పది మందికి కలిసి పెద్ద ఎత్తున కష్టపడినట్లుగా చెప్పారు. ఈ సందర్భంగా తాము రూ.10లక్షల వరకు ఖర్చు చేసినట్లుగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొందరి చెప్పుడు మాటల్ని విన్న తర్వాత ఎమ్మెల్యే తమను దూరం పెట్టారన్నారు.

అందుకే తమకు న్యాయం చేయాలని ప్రశ్నించేందుకే తాను వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సదరు యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించి.. విచారణ జరుపుతున్నారు. ఏమైనా.. నడి రోడ్డు మీద సొంత పార్టీకి చెందిన యూత్ నేత ఒకరు నిలదీయటం ఎమ్మెల్యేకు ఇబ్బందికరంగా మారిందన్న మాట వినిపిస్తోంది.