Begin typing your search above and press return to search.

ప్రముఖ నటుడు మోహన్ బాబుకు షాక్

By:  Tupaki Desk   |   18 Feb 2021 4:49 PM GMT
ప్రముఖ నటుడు మోహన్ బాబుకు షాక్
X
ప్రముఖ టాలీవుడ్ నటుడు మోహన్ బాబుకు గట్టి షాక్ తగిలింది. ఆయనకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు షాకిచ్చారు. ఏకంగా రూ. లక్ష రూపాయల జరిమానా విధించారు. దీనికి సంబంధించిన నోటీసులను ఆయనకు పంపారు.ఆ నోటీసుల్లో ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోను కూడా పంపారు.

హైదరాబాద్ లోని ఫిలింనగర్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న బస్టాప్ ఎదురుగా మోహన్ బాబు ఇల్లు ఉంది. ఆయన ఇంటి ప్రహరీకి ఎత్తైన అడ్వటైజ్ మెంట్ బోర్డును కొన్నాళ్ల క్రితం అమర్చారు. ఏకంగా అది 15 అడుగుల ఎత్తులో ఆ బోర్డు ఉండడంతో అధికారులు అభ్యంతరం తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టంలోని నిబంధనలకు ఉల్లంఘిస్తోందని నోటీసుల్లో పేర్కొన్నారు.

దీనిపై కొందరు జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయగా.. వారు తాజాగా చర్యలు తీసుకున్నారు. మోహన్ బాబుకు రూ.లక్షల జరిమానా విధించారు. జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ఇలా ప్రకటన ఏర్పాటు చేసినందుకు జరిమానా విధిస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.అయితే ఈ నోటీసులపై నటుడు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు స్పందించాల్సి ఉంది.