Begin typing your search above and press return to search.
సబితమ్మకు షాక్.. ఆ కేసులో సీబీఐ కౌంటర్ తో కష్టకాలమేనా?
By: Tupaki Desk | 17 Aug 2021 3:36 AM GMTపాత గాయం తాలుకు ఇబ్బంది మళ్లీ మొదలైంది. తప్పు చేసినట్లుగా వచ్చిన ఆరోపణలకు తాజాగా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కొత్త కష్టాన్ని తీసుకొస్తున్నట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో ఉమ్మడి రాష్ట్రంలోని వైఎస్ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించిన సబితా ఇంద్రారెడ్డి తప్పులు చేశారని.. ఆమె మంత్రిత్వ శాఖ జరిపిన కేటాయింపుల్లో తప్పులు దొర్లాయన్న ఆరోపణ గురించి తెలిసిందే. పెన్నా సిమెంట్స్ కు గనుల లీజు విషయంలో అప్పట్లో గనుల శాఖా మంత్రిగా వ్యవహరించిన సబితా ఇంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణ ఉంది. తాజాగా ఇదే కేసుకు సంబంధించి సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అందులో.. సబితకు కొత్త కష్టాల్ని తెచ్చి పెట్టేలా కౌంటర్ ఉండటం గమనార్హం.
పెన్నా సిమెంట్స్ కు గనుల లీజుకు సంబంధించి ఆమెపై ఆరోపణలు నిజమనేలా సీబీఐ కౌంటర్ ఉండటం ఒక ఎత్తు అయితే.. తాండూరుకు చెందిన గనుల లీజు పునరుద్ధరణ వ్యవహారంలోనూ కీలక పాత్ర పోషించారని పేర్కొంది. దీంతో.. ఆమెకు ఈ కేసులో మరిన్ని ఇబ్బందులు ఖాయమన్న మాట వినిపిస్తోంది. మరోవైపు.. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో తనపై కేసు కొట్టేయాలని కోరుతూ సబితా ఇంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ మొదలు పెట్టింది. ఈ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగానే ఓఎంసీకి లీజు మంజూరు చేసినట్లు అందులో పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈ రోజు (మంగళవారం) విచారణ కొనసాగనుంది.
ఇక.. పెన్నా కేసు విషయానికి వస్తే పెన్నా గ్రూపు అధినేత పెన్నా ప్రతాపరెడ్డి డిశ్చార్జి పిటిషన్ పై సోమవారం వాదనలు సాగాయి. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్య చేసింది. అభియోగాల నమోదు దశలో నిందితులను డిశ్చార్జి చేయరాదని పేర్కొంది. పెన్నా ప్రతాపరెడ్డి పిటిషన్ పై తదుపరి విచారణ ఆగస్టు 23కు వాయిదా పడింది. లేపాక్షికి అనంతపురంలో భూములు కేటాయింపు కేసులో డిశ్ఛార్జి పిటిషన్ లు దాఖలు చేయటానికి వారి తరఫు న్యాయవాది గడువు కోరటంతో సమ్మతించిన కోర్టు ఈ కేసు విచారణను ఆగస్టు 24కు వాయిదా వేసింది. ఒకవేళ ఆ గడువు లోపు పిటిషన్ లు దాఖలు చేయని పక్షంలో వాదనలకు సిద్ధం కావాలని స్పష్టం చేసింది.
మొత్తంగా జగన్ అక్రమాస్తుల కేసులకు సంబంధించిన నమోదు చేసిన వివిధ కేసులు విచారణకు రావటం ఒక ఎత్తు అయితే.. సబితకు షాకిచ్చేలా సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ ఉందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయంలో సబిత తరఫున న్యాయవాది వాదనలు ఏ రీతిలో ఉండనున్నాయి? సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ తేలిపోయేలా వారు ఏ తరహా వాదనలు వినిపించనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.