Begin typing your search above and press return to search.
షా కు షాక్... చేరికల్లేవ్ ! అయ్యో పాపం బండి !
By: Tupaki Desk | 16 May 2022 6:01 AM GMTభాగ్య నగరి శివారుల్లో తుక్కుగూడ సభకు విచ్చేసిన అమిత్ షాకు షాకుల మీద షాకులు ఇచ్చారు స్థానిక బీజేపీ శ్రేణులు మరియు నాయక వర్గం కూడా ! ఆయన వస్తే కనీస స్థాయిలో చేరికల్లేవు. ఆవిధంగా ఆయన్ను నిరాశలో ముంచేశారు. దిగ్భ్రాంతికి గురి చేశారు. ఆఖరికి కేఏ పాల్ పార్టీ ప్రజా శాంతి పార్టీలో కూడా చేరికలు ఉన్నాయి కానీ విజయశాంతి లాంటి ఛార్మింగ్ లీడర్లు ఉన్న పార్టీలో చేరికలు లేవే అని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు.
కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి డాక్టర్లు, కరడుగట్టిన కాంగ్రెస్ వాదులు బీజేపీ గూటికి చేరుతారన్న వార్తలు వచ్చినా అవన్నీ అబద్ధాలే అని తేలిపోయాయి. మొదట బీజేపీలో చేరుతానని, తెలంగాణలో ఊపు తీసుకువస్తానని చెప్పిన డాక్టర్ సాబ్ చెప్పాపెట్టకుండానే లండన్ కు విహారానికి వెళ్లి పోయారని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు.
వాస్తవానికి అమిత్ షా లాంటి అగ్ర స్థాయి నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు చేరికలు ఆశించడం సహజమే! ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిలోనో లేదా కాంగ్రెస్ లాంటి అతి పెద్ద సముద్రంలాంటి పార్టీలో ఈదలేకో ఏదో ఒక వర్గం బీజేపీకి మద్దతు పలకుతుందనుకున్నారు. ఈ దశలో భారీ చేరికలు ఉంటాయని ఆశించి ఇటుగా వచ్చిన అమిత్ షాకు కోలుకోలేని దెబ్బ కొట్టాయి
స్థానిక పరిణామాలు.
ముఖ్యంగా తెలంగాణలో ఎప్పటి నుంచో మోడీ నాయకత్వంపై ఆశాజనకంగా ఉన్న కొన్ని వర్గాలను తమవైపు తిప్పుకోవాలని భావించినా, అమిత్ షా రాకతో అది సాధ్యం కాకుండాపోయింది. మరోవైపు టీఆర్ఎస్ చెబుతున్న మాటలు, చేస్తున్న విమర్శలు కూడా బీజేపీ చేరికలను అడ్డుకోవచ్చు.
ఇంకా టిక్కెట్లు కన్ఫం కాలేదు కనుక చేరికలు లేకపోవచ్చు. ఇవన్నీ కాకుండా ధరల పెరుగుదల సంబంధిత వ్యతిరేకత అన్నవి ఓ ప్రతికూల అంశంగానూ ఉండవచ్చు. ఇవన్నీ బీజేపీ ఎదుగుదలను ముఖ్యంగా అమిత్ షా ఆశలను నిలువరించవచ్చు.
ఏదేమయినప్పటికీ తెల్లారితే చాలు బండి సంజయ్ అనే వ్యక్తి తమ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని నోటికి వచ్చిన విధంగా తిట్టి, అటుపై ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఆ కోపం, ఆ వేగం తగ్గించి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అని మరీ మరీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడగడమేంటి అడుక్కోవడం ఏంటి అని గులాబీ దళాలు పెదవి విరుస్తున్నాయి.