Begin typing your search above and press return to search.
స్టాలిన్ కు షాక్.. డీఎంకే’కు‘ ఎదురుదెబ్బ
By: Tupaki Desk | 24 Oct 2019 6:47 AM GMTతమిళనాడులో వచ్చేసారి అధికారంలోకి వచ్చేది డీఎంకే పార్టీ అని తమిళనాటే కాదు.. దేశవ్యాప్తంగా ఎవ్వరినీ అడిగినా ఇదే విషయం చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ బలం, బలగం అంతా పోయింది. కుమ్ములాటలు, కుర్చీల గొడవలతో అన్నాడీఎంకే పార్టీ అభాసుపాలైంది.
ఇక ఈ కోవలోనే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే చావు దెబ్బతిన్నది. డీఎంకే సూపర్ విజయాన్ని అందుకుంది. ఆ పార్టీ అధినేత స్టాలిన్ కు అపూర్వ విజయం దక్కింది. స్టాలిన్ కొట్టిన దెబ్బకు ఇక నాయకుడు లేని అన్నాడీఎంకే కోలుకోదని.. ఆ పార్టీ పని ఖతమేనని అంతా భావించారు. ఇక వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ డీఎంకే పార్టీదే అధికారం అని స్టాలిన్, డీఎంకే ధీమాగా ఉన్న సమయంలోనే గట్టి దెబ్బ తగిలింది.
తాజాగా తమిళనాడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో డీఎంకేకు ఎదురుదెబ్బ తగలింది. తాజాగా ఫలితాల్లో రెండు స్థానాల్లో అధికార అన్నాడీఎంకే గెలవడం లాంఛనంగా మారింది. స్టాలిన్, డీఎంకే ఎంత ప్రయత్నించినా ఇక్కడ గెలువలేకపోవడం ఆ పార్టీ భవిష్యత్ పై ఆందోళనకు కారణమవుతోంది.
తమిళనాడులో జరిగిన మొన్నటి ఎంపీ ఎన్నికల్లో మొత్తం 39 స్తానాల్లో డీఎంకే ఏకంగా 22 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఉప ఎన్నికల్లోనూ డీఎంకేదే విజయం అని అంతా అనుకున్నారు. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అన్నాడీఎంకే గెలుస్తుండడం డీఎంకే అధినేత స్టాలిన్ కు షాక్ లా పరిణమించింది. దాదాపు రెండు దఫాలు పదేళ్లు అధికారానికి దూరంగా జయలలితను తట్టుకొని నిలబడ్డ డీఎంకే ఈసారి అధికారమే లక్ష్యంగా ముందుకెళుతుండగా తాజా ఫలితాలు మాత్రం ఆపార్టీని డిఫెన్స్ లో పడేశాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.