Begin typing your search above and press return to search.
టీబీజేపీకి షాక్: కేసీఆర్ పాలన బాగుందన్న కేంద్ర మంత్రి
By: Tupaki Desk | 1 May 2022 2:30 AM GMTతెలంగాణ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నేతలకు భారీ షాక్ తగిలింది. నిత్యం కేసీఆర్‌ను ఆయన పాలనను విమర్శిస్తూ.. రాజకీయాలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలకు దిమ్మతిరిగి పోయేలా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. వ్యాఖ్యలు ఉన్నాయి.
ఆయన కేసీఆర్ సర్కారు పొగడ్తలతో ముంచెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసిస్తూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు బీజేపీలో హాట్‌టాపిక్‌గా మారాయి.
రాష్ట్రంలో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలను కేందమంత్రి చేశారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో హైదరాబాద్ దాహార్తి తీరిందన్నారు. అయితే గడ్కరీ వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో ట్రోల్ అవుతోన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు తానే స్వయంగా అనుమతులిచ్చానని గడ్కరీ పేర్కొన్నారు. టీఆర్ఎస్‌పై గడ్కరీ పొగడ్తలతో బీజేపీలో రచ్చ మొదలయింది. గడ్కరీ స్పీచ్‌ను ఎవరు సిద్ధం చేశారంటూ కమలనాథులు ఆరా తీస్తున్నారు.
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రలోనూ ఇదే అంశంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఓవైపు బండి యాత్ర చేస్తుంటే.. మరోవైపు కేంద్రమంత్రులు టీఆర్ఎస్‌ను పొగడడమేంటని పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎవరి ప్రోద్బలంతో స్పీచ్ తయారు చేశారో అంటూ కమలనాథులు గుసగుసలాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీ ఎలా పుంజుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.
``కేంద్ర మంత్రులు ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాలి. ఏదో జరిగిపోతోందని.. ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మేం ఇక్కడ పాయదాత్రలు చేస్తున్నం. పార్టీని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కిస్తున్నం.
కానీ, కేంద్రం నుంచి వస్తున్న నాయకులు చేస్తున్న వ్యాఖ్యలతో మా వ్యాఖ్యలు అర్ధం లేకుండా పోతున్నాయి. వీటికి ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక అల్లాడుతున్నాం. ఇప్పటికైనా.. రాష్ట్రంలో ఏం జరుగుతోందో.. ముందు తెలుసుకుని కేంద్రం పెద్దలు మాట్లాడితే.. బాగుంటుంది`` అని బండి సంజయ్ కు అత్యంత సన్నిహిత నేత ఒకరు మీడియాతో వ్యాఖ్యానించడం గమనార్హం.