Begin typing your search above and press return to search.

కాకినాడలో టీడీపీకి షాక్

By:  Tupaki Desk   |   2 Aug 2021 4:55 AM GMT
కాకినాడలో టీడీపీకి షాక్
X
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. తమను స్వతంత్రులుగా గుర్తించాలని రిక్వెస్టు చేస్తు టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమీషనర్ కు లేఖరాయటం సంచలనంగా మారింది. 2017లో జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. కార్పొరేషన్లోని 48 డివిజన్లలో టీడీపీ 32 డివిజన్లలో గెలిచి మేయర్ పీఠాన్ని సొంతం చేసుకుంది.

ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడలో వైసీపీ గెలిచింది. అప్పటినుండి పరిస్దితులు మారుతూ వచ్చాయి. తాజాగా మున్సిపల్ చట్టాన్ని సవరించి ప్రతి మున్సిపాలిటిలో రెండు వైస్ ఛైర్మన్ పోస్టులు, రెండు డిప్యుటి మేయర్ల పోస్టులను ప్రభుత్వం సృష్టించిన విషయం తెలిసిందే. అంటే ఇఫ్పటికే ఒక పోస్టుండగా రెండో పోస్టుకోసం చట్టాన్ని సవరించింది. రాష్ట్రమంతటా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయటంతో ఛైర్మన్, మేయర్ పోస్టులతో పాటు డిప్యుటి, వైస్ ఛైర్మన్ పోస్టులు కూడా వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

అన్నీచోట్లా జరిగినట్లే కాకినాడలో కూడా రెండో డిప్యుటి మేయర్ పోస్టుకు ఎన్నిక జరగాలని కార్పొరేషన్ డిసైడ్ చేసింది. రేపు 4వ తేదీన ఎన్నిక నిర్వహణకు ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే ప్రభుత్వమేమో వైసీపీది కార్పొరేషన్ ఏమో టీడీపీ చేతిలో ఉంది. దాంతో అభివృద్ధి జరగదన్న విషయమై ఆలోచించిన 21 మంది కార్పొరేటర్లు టీడీపీకి రాజీనామాలు చేసేశారు. తమను స్వతంత్రులుగా గుర్తించాలని కోరుతు కమీషనర్ కు లేఖ రాయటం పార్టీలో కలకలం సృష్టించింది.

2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ తరపున గెలిచిన 32 మంది కార్పొరేటర్లలో 11 మంది వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. మరో ఇద్దరు మరణించారు. ఇక టీడీపీలో మిగిలింది 19 మంది కార్పొరేటర్లు మాత్రమే. అయితే తాజాగా వైసీపీకి అనుకూలంగా ఉన్న కార్పొరేటర్లు+టీడీపీలో ఉన్న 19 మంది కార్పొరేటర్లు కలిసి 21 మంది స్వతంత్రులుగా గుర్తించాలని లేఖ రాశారు. ఇదంతా ఎందుకు చేశారంటే రెండో డిప్యుటి మేయర్ పోస్టును గెలిపించుకునేందుకేనట.

సరే చివరకు టీడీపీలో మిగిలిన కార్పొరేటర్లు ఏమి చేస్తారనేది పక్కనపెడితే ఇప్పటికైతే టీడీపీకి పెద్ద షాకే తగిలింది. 32 మంది కార్పొరేటర్లలో 21 మంది స్వతంత్రులుగా ప్రకటించేసుకున్నారు. మహా అయితే టీడీపీలో కంటిన్యు అవుతున్న వారిసంఖ్య సింగిల్ డిజిట్ కు పడిపోయింది. వీళ్ళు కూడా రేపో మాపో టీడీపీకి రాజీనా