Begin typing your search above and press return to search.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను వాడకాన్ని ఆరు దేశాల్లో ఆపేశారు

By:  Tupaki Desk   |   12 March 2021 5:30 AM GMT
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ను వాడకాన్ని ఆరు దేశాల్లో ఆపేశారు
X
కోవిడ్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్లలో ఒకటిగా పేరున్న ఆస్ట్రాజెనెకాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని ఆరు దేశాలు నిలిపివేశాయి. ఈ వ్యాక్సిన్ వాడిన వారిలోని కొందరి శరీరాల్లో రక్తం గడ్డ కట్టిన ఆనవాళ్లను గుర్తించటంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డ కట్టిన ఆనవాళ్లను గుర్తించినట్లుగా ఫిర్యాదులు తెరమీదకు వచ్చాయి. దీంతో..ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని తాత్కాలికంగా ఆపేసినట్లుగా ఆరు దేశాలు వెల్లడించాయి.

అయితే.. రక్తం గడ్డ కట్టినట్లుగా చెబుతున్న ఉదంతాలకు టీకానే కారణమన్న ఆధారాలు ఏమీ ఇప్పటివరకు బయటకు రాలేదు. ఈ వ్యాక్సిన్ తీసుకున్న 49రోజులకు ఒక నర్సుకు తీవ్రమైన రక్తం గడ్డ కట్టిన సమస్యతో మరణించినట్లుగా గుర్తించారు. దీంతో.. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వాడకాన్ని తాము నిలిపివేస్తున్నట్లుగా ఆస్ట్రియా తాజాగా ప్రకటించింది.

ఈ దేశం తీసుకున్న నిర్ణయం బాటలోనే మరో ఐదు దేశాలు తీసుకోవటం గమనార్హం. ఆస్ట్రియా బాటలోనే మరో నాలుగు యూరోపియన్ దేశాలు ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకున్నాయి. అవేమంటే.. ఎస్టోనియా.. లాత్వియా.. లిథువేనియా.. లక్సెంబర్గ్ లు ఉన్నాయి. గురువారం నుంచి డెన్మార్క్ కూడా ఈ వ్యాక్సిన్ ఇవ్వటాన్ని నిలిపి వేసింది. మారచి తొమ్మిది నాటికి యూరోపియన్ యూనియన్ లోని మూడు మిలియన్లు (30 లక్షల మందికి) టీకాలు వేయగా.. వీరిలో 22 మందికి రక్తం గడ్డ కట్టిన కేసులు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యాక్సిన్ వాడకాన్ని ఆరు దేశాలు ఆపేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. మరిన్ని పరీక్షల తర్వాతే.. తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటారని చెబుతున్నారు.