Begin typing your search above and press return to search.
వైసీపీకి షాక్: చంద్రబాబు లేఖలపై పీఎంవో క్లారిటీ
By: Tupaki Desk | 25 March 2021 12:30 PM GMTఅధికారం కోల్పోయినప్పటి నుంచి బీజేపీకి దగ్గరి కావాలని చూస్తున్న చంద్రబాబుకు మోడీ నుంచి స్పందన రావడం విశేషం. ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా వస్తున్న చంద్రబాబు తాజాగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మాత్రం వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే లేఖలు రాశాడు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్రమోడీకి రెండు లేఖలు రాశారని.. పీఎంవో క్లారిటీ ఇచ్చింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 20న, మార్చి 10న ప్రధానికి చంద్రబాబు రెండు లేఖలు రాశారని.. అవి నేరుగా పీఎంవోకు అందినట్లు తెలిపింది.
ఆర్టీఐ దరఖాస్తు దారుడు రవికుమార్ ఈ మేరకు చంద్రబాబు లేఖలపై చర్యలు చెప్పాలని కోరారు. దీంతో పీఎంవో సమాధానం ఇచ్చింది. చంద్రబాబు లేఖలపై గడువులోగా జవాబు ఇవ్వాలని పబ్లిక్ అసెట్ మేనేజ్ మెంట్ విభాగానికి పీఎంవో సూచించింది.
విశాఖ ఉక్కుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏకంగా ప్రధాని మోడీకి లేఖ రాయలేదంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాజాగా తేలింది. లేఖలో విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యామ్మాయం ఆలోచించాలని చంద్రబాబు కోరారు. ఇన్నాళ్లు చంద్రబాబును ఈ విషయంలో టార్గెట్ చేసిన వైసీపీకి షాక్ తగిలింది.