Begin typing your search above and press return to search.

వైఎస్ షర్మిలకు షాక్.. ఆమె ఆవిష్కరించిన వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం

By:  Tupaki Desk   |   7 March 2021 7:30 AM GMT
వైఎస్ షర్మిలకు షాక్.. ఆమె ఆవిష్కరించిన వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం
X
తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టకముందే వైఎస్ షర్మిలకు గట్టి షాక్ తగిలింది. తాజాగా షర్మిల తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం శివాయిగూడెంలో ఈ ఘటన కలకలం రేపింది. దీనిపై వైఎస్ షర్మిల ఘాటుగా స్పందించారు.

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా వైఎస్ షర్మిల ఆరోపించారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ రావాలని.. ప్రజల్లో పెరుగుతున్న బలాన్ని.. నమ్మకాన్ని చూసి రాజకీయ ప్రత్యర్థులు తట్టుకోలేకపోతు్నారని ఆమె ఆరోపించారు.

వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని.. వైఎస్ఆర్ అభిమానులంతా సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

విగ్రహాలను ధ్వంసం చేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో నిలిచిన వైఎస్ఆర్ జ్ఞాపకాలు, ఆయన అందించిన పాలనను తొలగించలేరని అన్నారు.

షర్మిల రాజకీయ అరంగేట్రం చేయబోతున్న వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చారని.. ఇతర పార్టీల నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఖమ్మంలోని షర్మిల మద్దతుదారులు వ్యాఖ్యానించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ.. వచ్చేనెల 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయనే కారణంతో తమ సభను అడ్డుకోవడానికే వైఎస్ఆర్ విగ్రహాలపై దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని షర్మిల పార్టీ నేతలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నారు.