Begin typing your search above and press return to search.

షాకింగ్ ..సెలూన్ వ‌ర్కర్ నుండి 91 మందికి వైరస్ !

By:  Tupaki Desk   |   25 May 2020 12:30 PM GMT
షాకింగ్ ..సెలూన్ వ‌ర్కర్ నుండి 91 మందికి వైరస్ !
X
గత రెండునెలలుగా లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండటంతో జుట్టు బాగా పెరిగింది అని, సెలూన్‌ కు వెళ్తున్నారా.. అయితే, అక్కడ సరైన జాగ్రత్తలు పాటించాల్సిందే. లేకపోతే మహమ్మారి భారిన పడే అవకాశం ఉంది. తాజాగా ఒక సెలూన్ వ‌ర్కర్ కారణంగా 91 మందికి వైరస్ సోకింది. అమెరికాలోని మిస్సౌరీలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అందరూ ఐసోలేషన్‌ కు వెళ్లాల్సి వచ్చింది.

వీరిలో 84 మంది కస్టమర్లు, ఏడుగురు సెలూన్ వర్కర్లు ఉన్నారు. స్టైలిస్ట్, కస్టమర్లు ఫేస్ కవరింగ్ ధరించకపోవడం వల్లే వైరస్ సోకినట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవల లాక్‌ డౌన్ తర్వాత యూఎస్ ‌లో కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. మిస్సౌరీలో సెలూన్లు మే 4 ఓ సెలూన్‌ కు వెళ్లి చాలా మంది క్రాఫ్ సెట్ చేయించుకున్నారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ లక్షణాలు ఉన్న వర్కర్ నుంచి వీరందరికి సోకింది. దీంతో వైరస్ ఎప్పుడు ఎవరి నుంచి ఎలా సోకుతుందో తెలియక స్థానికులు భయపడిపోతున్నారు.

ఇకపోతే , అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ బాధితుల సంఖ్య 17 లక్షలకు చేరవవుతోంది. మహమ్మారి దెబ్బకు 99,300 మంది ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, దేశంలో వైరస్ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోందని, కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల సంఖ్య భారీగా పడిపోతుంది అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షకు చేరువవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.