Begin typing your search above and press return to search.
షాకింగ్: కేదార్ నాథ్ ఆలయంలోకి పెంపుడు శునకం.. ఏం జరిగిందంటే
By: Tupaki Desk | 21 May 2022 4:25 PM GMTచార్‌ధామ్ యాత్ర అంటే.. హిందువులకు పరమ పవిత్రమైన యాత్ర. పైగా ఉత్తరాఖండ్లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయానికి వెళ్లడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అయితే.. ఇంత పవిత్ర ఆలయంలోకి ఓ వ్లాగర్ పెంపుడు కుక్కను తీసుకెళ్లటం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారటంతో చర్యలు చేపట్టింది బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ. శునకం యజమానిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేదార్నాథ్ ఆలయంలోకి పెంపుడు శునకాన్ని తీసుకెళ్లిన దృశ్యాలు వైరల్గా మారిన క్రమంలో చర్యలు చేపట్టింది ఆలయ కమిటీ. కుక్కను తీసుకెళ్లిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బద్రీనాథ్- కేదార్నాథ్ ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వికాశ్ త్యాగీపై కేసు నమోదు చేశారు పోలీసులు.
"బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు ఈ విషయంపై దర్యాప్తు చేపట్టాం. పెంపుడు శునకంతో పాటు కేదార్నాథ్కు వచ్చిన వ్యక్తిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అతడిని గుర్తించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం." అని పోలీసులు తెలిపారు.
ఎవరంటే..వికాశ్ త్యాగీ.. సైబీరియన్ హస్కీ రకానికి చెందిన తన పెంపుడు శునకాన్ని కేదార్నాథ్ ఆలయం వద్దకు తీసుకెళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలయం ముందు ఉన్న 'నంది' విగ్రహానికి శునకం కాళ్లను ఆనించడం, దానికి బొట్టు పెట్టించటం, కుక్కను ఎత్తుకుని గుడ్రంగా తిరగటం వంటివి చేస్తూ కనిపించాడు.
ఈ సంఘటనపై.. భక్తులు, నెటిజన్లు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. ఈ విషయంపై ఆలయ కమిటీ సీఈఓకు అధ్యక్షుడు అజేంద్ర కీలక సూచనలు చేసినట్లు మీడియా సెల్ తెలిపింది. ఇలాంటి ఘటనలను ముందుగానే గుర్తించి.. అడ్డుకోవాలని, శునకాన్ని తీసుకొచ్చిన అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొంది.