Begin typing your search above and press return to search.
బాబుకు కూడా వారు చేదేనట...?
By: Tupaki Desk | 11 Jan 2022 3:30 PM GMTకాలం కలసిరాకపోతే మరి ఇలాగే ఉంటుందేమో. అసలే టాలీవుడ్ నానా రకాలైన సమస్యలతో సతమతమవుతోంది. కరోనా అన్ని దశలూ కలసి వరసగా వస్తూ నడ్డి విరగొడుతున్నాయి. ఈ టైమ్ లో కాస్తా ఊపిరి పీల్చుకునే చాన్స్ ఏమైనా ఉందా అని టాలీవుడ్ పెద్దలు వెతుకుతూంటే ఏపీ రాజకీయం వారికి తెగ ఇబ్బందిగా మారింది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి టాలీవుడ్ మీద హాట్ కామెంట్స్ చేశారు. అందులో చంద్రబాబుని కూడా ఇన్వాల్వ్ చేశారు.
చంద్రబాబుకు టాలీవుడ్ మద్దతు ఎక్కువగా ఉందని, అందుకే ఆయన వారిని అలా పెంచుకుంటూ పోయారని కూడా చెప్పుకొచ్చారు. బెనిఫిట్ షోస్, అధిక ధరలకు టికెట్లు ఆయన హయాంలోనే జరిగాయని ఆరోపించారు. దానికి ఇపుడు చంద్రబాబు కౌంటర్ ఇస్తూ మధ్యలోకి నన్నెందుకు లాగుతున్నారని మండిపడ్డారు. నా మీదనే టాలీవుడ్ లో సినిమాలు తీశారని, తాను సీఎం గా ఉండగా తనకు యాంటీగా ఎంతో మంది సినిమాలు తీశారంటూ చెప్పుకొచ్చారు.
టాలీవుడ్ తనకు ఎపుడు మంచి చేసిందని కూడా బాబు వాపోతున్నారు. ఆయన ఏకంగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయి మెగాస్టార్ చిరంజీవి 2009 ఎన్నికల్లో పార్టీ పెట్టకపోయి ఉంటే తప్పకుండా టీడీపీ గెలిచేదని అంటున్నారు. అలా టాలీవుడ్ తనకు మద్దతుగా లేదని ఆయన ఇన్నాళ్ళూ తనలో దాచుకున్న బాధ అనుకోండి ఆవేదన అనుకోండి వెళ్ళగక్కారు.
ఇంతకీ బాబుకు టాలీవుడ్ మద్దతు లేదు, జగన్ కి అసలు లేదు, మరి ఏపీలో టాలీవుడ్ కి దారేదీ మహానుభావా అంటే ఏం చెబుతారో సినీ వర్గాలు. మొత్తానికి తెలంగాణా ఏర్పాటు అయ్యాక ఆంధ్రాకు టాలీవుడ్ దూరం అయింది అని అంతా అనుకున్నారు. అది మరీ రాజకీయంగా మారి సీన్ ఇంతదాక తెస్తుదని ఎవరూ ఊహించి ఉండరు. మొత్తానికి చూసుకుంటే చంద్రబాబు చేసిన ఈ హాట్ కామెంట్స్ టాలీవుడ్ ను ఆలోచనల్లో పడవేస్తున్నాయి.