Begin typing your search above and press return to search.
అసాధారణం సరే.. దానికే అంత మాట అనేయాలా మోడీ?
By: Tupaki Desk | 6 Jan 2022 4:18 AM GMTనరేంద్ర మోడీ అన్నంతనే ఉక్కు మనిషి.. ఆయనకున్న ధైర్యసాహసాలు.. తెగువ.. ఇలా చెప్పుకొస్తే ఆయన్ను అమితంగా అభిమానించేవాళ్లు.. అంతకు మించి ఆరాధించేవారు..ఆయన్ను దేశ ఉద్దరణ కోసం పుట్టిన మహానేతగా చెబుతుంటారు. అందులో నిజం.. అబద్ధం ఎంతన్నది లెక్క వేయటం ఇక్కడ ఉద్దేశం కాదు. ఆయన అభిమానులు మోడీని కీర్తించిన స్థాయికి తగ్గట్లుగా ఆయన వ్యవహరించాల్సిన అవసరం లేకున్నా.. ఒక అసాధారణ ఉదంతానికి ‘ప్రాణాలతో తిరిగి రాగలిగా’ లాంటి అసాధారణ వ్యాఖ్య చేయటమా అని ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. దేశ ప్రధాని వరకు పక్కన పెడదాం.. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర హోం మంత్రి ఏదైనా కార్యక్రమానికి వచ్చేస్తున్నారంటే.. ఉండే హడావుడి అంతా ఇంతా కాదు.
అలాంటిది దేశ ప్రధాని.. అది కూడా మోడీ లాంటి అధినేత కాలు బయటకు పెట్టిన తర్వాత.. సెక్యురిటీ ఎంత పటిష్టంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ తమకు.. తమ పార్టీకి వ్యతిరేకత ఉందన్న మాట వినిపించే పంజాబ్ కు వచ్చేటప్పుడు మానసికంగా సిద్ధం కావటం ఖాయం. నిఘా విభాగాలు ఇచ్చే నివేదిక.. ప్రజల్లో మోడీ సర్కారు మీద ఉన్న వ్యతిరేకత నేపథ్యంలో.. ఏమైనా అనుకోని నిరసన ఎదురు కావొచ్చన్న మాట ఉంటుంది. అయితే.. అలాంటి వాటిని పూర్తిగా అణిచివేసి.. కార్యక్రమాన్ని అధినేత అనుకున్న రీతిలో పూర్తి చేయటం రక్షణ వర్గాలు చూసుకోవాల్సిన అంశం.
కానీ.. పంజాబ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కావొచ్చు.. ప్రధాని మోడీ నిఘా వర్గం అంచనాలు తప్పై ఉండొచ్చు.. మొత్తానికి తాను వెళ్లాల్సిన ప్లేసుకు వెళ్లకుండా.. ఒక ఫ్లైఓవర్ మీద మోడీ ఆగిపోవటం.. దాదాపు 20నిమిషాల పాటు నడి రోడ్డు మీద నిలిచిన వైనం అసాధారణమనే చెప్పాలి. నిరసనకారుల నిరసన నేపథ్యంలో ముందుకు వెళ్లే పరిస్థితి లేకపోవటంతో.. ఆగిపోయి ఫ్లైఓవర్ మీద నుంచి విమానాశ్రాయానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా విమానాశ్రయ సిబ్బందితో మీ ముఖ్యమంత్రికి థ్యాంక్స్.. కనీసం నేను భఠిండా ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో తిరిగి రాగలిగా’ అంటూ ఫైర్ అయినట్లుగా మాటలు బయటకు వచ్చాయి.
మోడీ స్థాయి నేత నోటి నుంచి రావాల్సిన మాటలేనా ఇవి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. నిరసనకారుల కారణంగా దేశ ప్రధాని కాన్వాయ్.. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగిపోవటం.. ముందుకు వెళ్లలేని పరిస్థితిలో వెనక్కి వెళ్లిపోవాల్సిన రావటానికి మించిన ఇబ్బందికర పరిస్థితి మరొకటి ఉండదు. అలాంటి సమయంలోనే ఆచితూచి అన్నట్లుగా వ్యాఖ్యలు చేయాల్సింది. లేదంటే.. మౌనంగా ఉండాల్సింది. అందుకు భిన్నంగా.. ప్రాణాలతో ఎయిర్ పోర్టుకు రాగలిగా అన్న పెద్ద మాట మోడీ నోటి నుంచి ఎందుకు వచ్చినట్లు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రాజకీయ విశ్లేషకుల కోణంలో చూస్తే.. తన నోటి మాటతో సానుభూతి వర్షం కురవాలన్నదే మోడీ ఆలోచనగా చెబుతున్నారు. కానీ.. ఆయన మాటలు అలా లేవన్న విషయాన్ని ఆయనకు అర్థమయ్యేలా ఎవరు చెప్పగలుగుతారు?