Begin typing your search above and press return to search.
వామ్మో.. డ్యాన్స్ ఇలా కూడా చేస్తారా?
By: Tupaki Desk | 22 April 2021 4:39 AM GMTమనం ఇప్పటివరకు రకరకాల డ్యాన్స్ లు చూసి ఉంటాం. శరీరాన్ని వివిధ భంగిమల్లో తిప్పేవాళ్లను.. తీగల మీద డ్యాన్స్ లు చేసే వాళ్లను చూసి ఉంటాం. కానీ ఓ అమ్మాయి ఏకంగా నీటిలో డ్యాన్స్ చేసింది. నీటిలో కొద్దిసేపు ఉండటమే మనకు చాలా కష్టం. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు. మనకు ఊపిరి ఆడదు. ఓ అమ్మాయి దాదాపు మూడు నిమిషాల పాటు నీటిలో డ్యాన్స్ చేసి రికార్డు నెలకొల్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ అమ్మాయి ప్రతిభను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. నీటిలో ఓ నిమిషం ఉండటమే ఎంతో కష్టమైన పని. అటువంటిది. ఏకంగా నీటి అడుగుభాగంలో మూడు నిమిషాలపాటు మ్యూజిక్ కు అనుగుణంగా తన శరీరాన్ని తిప్పుతూ ఓ అమ్మాయి డ్యాన్స్ చేయడం చూసి ఏకంగా ప్రపంచమే నివ్వెరపోయింది. అసలు ఈ అమ్మాయి నిజంగా డ్యాన్స్ చేసిందా? లేక ఏదన్నా గ్రాఫిక్స్ ఎఫెక్టా అని కూడా కొంతమంది సందేహించారంటే .. ఆమె పర్ఫామెన్స్ ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు.
ఫ్రాన్స్‌కు చెందిన అరియాడినో హఫీజ్ ఓ గొప్ప డ్యాన్సర్. అందరిలా డాన్స్ చేస్తే తన గొప్పతనం ఏముంది? అందుకే విభిన్నంగా ఆలోచించింది. నీటి అడుగుభాగంలో డ్యాన్స్ చేయాలని ఫిక్స్ అయింది. ఇందుకోసం ఓ తానే ఓ డ్యాన్స్‌ను కంపోజ్ చేసుకున్నది. ఇక నీటి అడుగుభాగంలో డ్యాన్స్ చేసి శబాష్ అనిపించుకున్నది. ఈ వీడియోకు బాస్టియన్ సోలైల్ దర్శకత్వం వహించారు. అయితే నీటిలో చేసిన ఈ డ్యాన్స్ షూటింగ్ ఎంతో కష్టంగా తీశారట. యూనిట్ సభ్యులు 120 సార్లు బయటకు రావాల్సి వచ్చిందట. అంటే వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. చక్కటి లైటింగ్. నీటిలో డ్యాన్స్ కు నప్పే కాస్ట్యూమ్స్ ఈ వీడియోను మరింత ఆకర్షణీయంగా తయారుచేశాయి. ఏది ఏమైనప్పటికీ నీటిలో డ్యాన్స్ చేయడం మామూలు విషయం కాదని చాలా మంది ఈ యువతిని మెచ్చుకుంటున్నారు. ఆమె సాహసానికి జోహార్లు చెబుతున్నారు. డ్యాన్స్ అందరూ చేస్తారు.. కానీ వినూత్నంగా చేయాలన్న ఆమె ఆలోచనే ఇప్పుడు ఆమెను స్టార్ ను చేసింది.