Begin typing your search above and press return to search.
టీవీ-9కు జాఫర్ అవసరం తీరిపోయిందా...! లేదా?
By: Tupaki Desk | 1 Oct 2019 8:22 AM GMTతెలుగు రాజకీయ రంగంలో ఎంతోమంది కరుడు గట్టిన కోపిష్టులు/కాంట్రవర్సీ నేతలను సైతం తనదైన స్టైల్లో ఇంటర్వ్యూలు చేసిన టీవీ 9 జాఫర్ ఇక మామూలు జాఫర్ అయిపోయాడు. టీవీ 9లో ముఖాముఖి కార్యక్రమంలో ఎంతో మంది నేతలను గుచ్చి గుచ్చి సూటిగా ప్రశ్నలు వేయడంలో జాఫర్‌కు జాఫరే సాటి అనిపించాడు. ఇక జాఫర్ ను తాజాగా టీవీ 9 యాజమాన్యం సంస్థ నుంచి తొలగించింది. ఇందుకు స్పష్టమైన కారణాలు ఏంటన్నది మాత్రం అంతు పట్టకపోయినా కొద్ది రోజుల క్రితం జాఫర్ టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ను కలవడమే అని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ముఖాముఖీ కార్యక్రమం ద్వారా పాపులర్ అయిన జాఫర్ ఇటీవల తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్ బాస్ 3 లో కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక జాఫర్ రవిప్రకాశ్ ను కలిశారని... ఈ విషయం తెలిసిన వెంటనే జాఫర్ ను సంస్థకు రిజైన్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఇక జాఫర్ ముఖాముఖీ కార్యక్రమాల వల్ల ఆ సంస్థకు టాప్ రేటింగులు వచ్చాయన్న విషయంలో సందేహం లేదు.
ఇక కొద్ది నెలల క్రితమే ఈ ఛానెల్ సీఈవోగా ఉన్న రవిప్రకాశ్ ను కొన్ని ఆరోపణల నేపథ్యంలో తప్పించారు. ప్రస్తుతం రవిప్రకాశ్ మీద విచారణ నడుస్తున్న టైంలోనే ఇప్పుడు ఆయనకు సన్నిహితుడిగా ఉన్న జాఫర్ నుంచి తప్పించడం మీడియా - రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రవిప్రకాష్ సౌత్ ఇండియాలో నాలుగు భాషల్లో భారీ ఎత్తున ఛానెల్స్ ప్రారంభిస్తున్నారని... జాఫర్ ఆ మీడియాలోకి వెళ్లిపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
ఇక ఛానెల్ నుంచి బయటకు వచ్చిన జాఫర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 15 ఏళ్లుగా జర్నలిజంలో ఉంటున్నానని... 5 ఏళ్లుగా ముఖాముఖీ కార్యక్రమాలు చేస్తున్నా... నాకు వ్యక్తిగతంగా ఎవరిపైనా కోపం లేదని... ఇక ఏం చేయాలో నెల రోజుల్లో డిసైడ్ చేస్తానని చెప్పారు.