Begin typing your search above and press return to search.

ఆ ఆశ‌తోనే జ‌న్‌ ధ‌న్ ఖాతాలు ఓపెన్ చేశార‌ట‌

By:  Tupaki Desk   |   28 Oct 2017 4:33 AM GMT
ఆ ఆశ‌తోనే జ‌న్‌ ధ‌న్ ఖాతాలు ఓపెన్ చేశార‌ట‌
X
అధికారంలోకి వ‌చ్చిన కొద్దిరోజుల‌కే ప్ర‌ధాని మోడీ పేదోళ్ల‌కు బ్యాంకు ఖాతాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలంటూ నిర్ణ‌యం తీసుకోవ‌టం తెలిసిందే. బ్యాంక‌ర్ల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించి మ‌రీ బ్యాంకు ఖాతాలు తెరిపించారు. మోడీ స్పీడ్‌ కు త‌గ్గ‌ట్లే సామాన్యులు సైతం బ్యాంకు ఖాతాల్ని భారీగా తెరిచారు. వీరి స్పంద‌న‌ను త‌మ ప్ర‌భుత్వ గొప్ప‌గా చెప్పుకున్నారు ప్ర‌ధాని మోడీ. స్వ‌దేశంలోనే కాదు విదేశీ వేదిక‌ల మీద కూడా జ‌న్ ధ‌న్ ఖాతాల్ని తెరిపించ‌టంలో త‌మ స‌ర్కారు ప‌ని తీరును గొప్ప‌గా చెప్పుకున్నారు.

గ‌తంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌ని రీతిలో త‌మ ప్ర‌భుత్వం పేద‌ల చేత బ్యాంకు ఖాతాల్ని తెరిపించిన‌ట్లుగా మోడీ చెప్పుకున్నారు. మోడీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నించిన వెంట‌నే పేద‌లు అంత పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు ఎందుకు తెరిచిన‌ట్లు? త‌మ ఖాతాల్లో పొదుపు మొత్తాన్ని ఎందుకు దాచిన‌ట్లు? లాంటి సందేహాలు కొంద‌రికి వ‌చ్చినా పెద్ద‌గా ఫోక‌స్ చేసింది లేదు. అయితే.. ఇదే విష‌యాన్ని డీప్ గా స్ట‌డీ చేసింది ప్ర‌పంచ బ్యాంకు బృందం.

రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని ప‌లు రాష్ట్రాల్లోని సామాన్యుల‌ను ప్ర‌పంచ బ్యాంకు బృందం స‌ర్వే నిర్వ‌హించింది. మొత్తం 12 రాష్ట్రాల్లో 12 వేల మందిని స‌ర్వే నిర్వ‌హించి.. వారి వివ‌రాలు రాబ‌ట్ట‌టంతో పాటు.. వారెందుకు జ‌న‌ధ‌న్ ఖాతాలు తెరించింద‌న్న అంశంపై లోతుగా దృష్టి సారించింది. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశాలు వెలుగులోకి వ‌చ్చాయి.

జ‌న‌ధ‌న్ ఖాతాను తెరిస్తే త‌మ ఖాతాల్లోకి వివిధ ప‌థ‌కాల‌కు సంబంధించిన న‌గ‌దు బోన‌స్ జ‌మ అవుతుంద‌ని భావించార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల వ‌ర‌కే తీసుకుంటే.. ఇలా అనుకున్న వారు 31 శాతం ఉన్న‌ట్లు వెల్ల‌డైంది. దేశ వ్యాప్తంగా చూస్తే ఇలాంటి ఆశ‌లు పెట్టుకున్న వారు 13 శాతం మంది ఉండ‌టం గ‌మ‌నార్హం.

అలా ఖాతా తెరిస్తే ఇలా డ‌బ్బులు ప‌డిపోతాయ‌ని భావించిన వారిలో బీహార్ రాష్ట్ర ప్ర‌జ‌లు 46 శాతం మంది ఉంటే త‌ర్వాతి స్థానంలో ఏపీ ప్ర‌జ‌లు ఉండ‌టం విశేషం. మోడీ సర్కార్ జ‌న్‌ధ‌న్ ప‌థ‌కం మొద‌లు పెట్టిన ఏడాదిన్న‌ర త‌ర్వాత 2016 జ‌న‌వ‌రి- మార్చి మ‌ధ్య ప్ర‌పంచ బ్యాంకు బృందం ఏపీ తెలంగాణ‌ల‌తో స‌హా 12 రాష్ట్రాల్లోని వారిని స‌ర్వే చేసింది. ప‌థ‌కం అమ‌లు.. దానిపై ప్ర‌జ‌ల‌కున్న అంచ‌నాల‌పై వివ‌రాల్ని సేక‌రించింది. ఏదో లాభం జ‌రుగుతుంద‌న్న ఉద్దేశంతోనే జ‌న‌ధ‌న్ ఖాతాలు తెరిచిన‌ట్లు తాజా స‌ర్వే వెల్ల‌డించిన‌ట్లైంది.

స‌ర్వేలో బ‌య‌ట‌ప‌డిన అంశాలు చూస్తే..

- ఖాతా తెరిచిన వెంట‌నే బోన‌స్ ప‌డుతుంద‌ని కొంద‌రు భావించారు

- బ్యాంకు ఖాతా ప్రారంభించిన త‌ర్వాత ల‌భించే ఓవ‌ర్ డ్రాఫ్ట్‌ ను వెన‌క్కి ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌నుకున్నారు

- రూ.5వేల ఓవ‌ర్ డ్రాఫ్ట్ ఇస్తార‌న్న ఉద్దేశంతో ఖాతా తెరిచిన‌ట్లు మ‌హారాష్ట్రలో 25 శాతం మంది చెప్పారు

- స‌బ్సిడీ మొత్తాల్ని వేసిన‌ట్లుగానే ఓవ‌ర్‌ డ్రాఫ్ట్ మొత్తాన్ని కూడా వేస్తార‌ని ఊహించినోళ్లు ఎక్కువ‌

- రాజ‌స్థాన్‌.. బిహార్‌.. హ‌ర్యానాల‌లో ప‌లువురు విదేశాల నుంచి తెచ్చే బ్లాక్ మ‌నీని ఈ ఖాతాలో వేస్తార‌నుకున్నారు

- విదేశాల నుంచి తెచ్చే న‌ల్ల‌ధ‌నాన్ని త‌మ బ్యాంకు ఖాతాలో వేస్తార‌నుకున్న వారిలో అత్య‌ధికులు క‌నిష్ఠంగా రూ.5వేలు గ‌రిష్ఠంగా రూ.1.5ల‌క్ష‌ల ప‌డ‌తాయ‌ని భావించారు