Begin typing your search above and press return to search.
కల్కి భగవాన్ ఎవరు? ఎలా ఎదిగారు.? కథేంటి?
By: Tupaki Desk | 21 Oct 2019 4:46 AM GMTకల్కి భగవాన్.. ఒకప్పుడు ఎల్ ఐసీ ఉద్యోగి.. సీన్ కట్ చేస్తే భగవంతుడి పదో అవతారం కల్కి.. తులం బంగారం కొనుగోలు చేయలేని నిస్సహాయ మధ్యతరగతి ఉద్యోగి ఇప్పుడు అదే బంగారంతో తులతూగే స్థితికి ఎలా చేరుకున్నారు.? కల్కి భగవాన్ ఆశ్రమమే ఒక మిస్టరీ.. ఈయన అసలు కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎలా మారారు.? కల్కి భగవాన్ ఆశ్రమాల్లో జరుగుతున్న ఐటీ దాడుల్లో వందల కోట్ల డబ్బు, నగలు, డాక్యుమెంట్లు - విదేశాల్లో అక్రమ ఆస్తులు బయటపడ్డాయి.. ఇన్ని వేల కోట్లకు ఎలా కల్కి అధిపతి అయ్యాడు? అసలు కల్కి ఆశ్రమాల్లో ఏం జరుగుతుంది? ఐటీ అధికారులు ఏం తేల్చారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
ఏపీ తమిళనాడు - తెలంగాణ - కర్ణాటకల్లో ఉన్న కల్కి ఆశ్రమాలు.. ఆస్తులపై ఇప్పుడు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. లెక్కకు మించిన ఆదాయం - లెక్కలేనన్ని నోట్ల కట్టలు బయటపడ్డాయి.
*అసలు ఎవరీ కల్కి భగవాన్.?
కల్కి భగవాన్ అలియాస్ విజయకుమార్ నాయుడు.. ఆస్తులపై తాజాగా ఐటీదాడులు కొనసాగుతున్నాయి. ఎవరీ విజయ్ కుమార్ నాయుడు? రెండు దశాబ్ధాలుగా భక్తి పేరుతో తనకు తాను దైవంతో పోల్చుకొని వేలకోట్ల రూపాయాల సామ్రాజ్యానికి అధిపతిగా కల్కి భగవాన్ కొనసాగుతున్నారు. భక్తి ముసుగులో సాగిస్తున్న అక్రమ వ్యాపారాల గుట్టు తాజాగా ఐటీ దాడుల్లో భయటపడింది.
విజయ్ కుమార్ రెండు దశాబ్ధాల క్రితం ఎల్ ఐసీలో సాధారణ క్లర్క్ గా జీవితాన్ని ప్రారంభించాడు. ఆ ఉద్యోగాన్ని వదిలేసి జీవాశ్రమం పేరుతో కుప్ప నియోజకవర్గంలోని రామకుప్పంలో ఓ కాన్వెంట్ స్కూల్ స్థాపించాడు. అది మొదట దివాళా తీసింది. ఆ తర్వాత కొంతకాలం కల్కి ఎవరికీ కనిపించలేదు. తర్వాత కొన్నేళ్లకు తనకు తాను దైవాంశ సంభూతుడిగా - విష్ణుమూర్తి ఆఖరి అవతారం కల్కి భగవానుడిగా ప్రకటించుకున్నాడు. ఇతడి ముఖ్య స్నేహితుడు కల్కి భక్తి వ్యాపారాన్ని విస్తరించి తారాస్థాయికి ప్రచారం చేసి తిరుగులేకుండా చేశారు. వ్యాపారమే కులవృత్తిగా ఉండే ఒక సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి కల్కి చేస్తున్న మాయలు - లీలలు అన్నీ ఇన్నీ కావు..
*కల్కి దర్శనానికి రూ.25వేలు
కలియుగ దేవుడిగా పేరు తెచ్చుకున్న కల్కిని చూడడానికి భక్తులు సాధారణ దర్శనానికి రూ.5వేలు - ప్రత్యేక దర్శనానికి రూ.25వేలు చెల్లించాల్సిందే.. ఇక ఆయన కాళ్లకు తాకాలంటే మరో పేద్ద రేటు వసూలు చేస్తారు. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంలో దాదాపు ఐదు ఎకరాల్లో జీవాశ్రమం ఉన్న చోటే కల్కి ఆశ్రమాన్ని ‘గోల్డెన్ సిటీ’గా ఏర్పాటు చేసి దాన్ని ‘వన్నెస్’ పేరుకు మార్చారు. చెన్నైలో కార్పొరేట్ ఆఫీసును నిర్వహిస్తున్నారు.ఇక ఆ తర్వాత కాలంలో తన భార్యను రంగంలోకి దించి అమ్మా భగవాన్ గా భక్తుల్లో ప్రచారం కల్పించారు. ఇప్పుడు కల్కి భగవాన్ పేరు దక్షిణ భారతదేశంలోని ఐదు రాష్ట్రాల్లో చిరపరిచితంగా మారింది. కల్కి పేరిట హోమాలు, యాగాలు, వీరి ఫొటోలను దేవుళ్లుగా ఇంట్లో పెట్టుకుంటున్నారు. వేల కోట్ల రూపాయల విరాళాలు కల్కి ఆశ్రమానికి వచ్చి కోట్లాది మంది భక్తులు తయారయ్యాయి.
*ఎన్నో వివాదాలు.. స్కాంలు
కల్కి భగవాన్ ఆశ్రమంలో కొంత మంది యువకులు, యువతులు అదృశ్యం కావడంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. భక్తుల సేకరించిన, వసూలు చేసిన కొన్ని వందల కోట్ల రూపాయలు విదేశాల్లో, దేశాల్లో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేయించినట్టు ఐటీ దాడుల్లో తేలింది. ఆశ్రమాల్లో కోట్ల నగదు కట్టలు - బంగారం - వజ్రాలు - ఆభరణాలు బయటపడ్డాయి. ఆశ్రమానికి సంబంధించిన నిధులను దారి మళ్లించి కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ నాయుడు - ఆయన భార్య ప్రీతీనాయుడు పేరిట అనేక దేశాల్లో - ఇండియాలోని సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లుగా ఐటీ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. పెద్ద ఎత్తున అమెరికన్ కరెన్సీ డాలర్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలియడంతో ఇదంతా డ్రగ్స్ సొమ్మ అన్న అనుమానాలు చెలరేగాయి.
*పరారీలో కలియుగ దేవుడు
కాగా కల్కి ఆశ్రమాలపై ఐటీదాడుల నేపథ్యంలో కల్కి భగవాన్ (విజయ్ కుమార్) - అమ్మ భగవాన్ (ప్రీతినాయుడు) ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కల్కి కుమారుడు కృష్ణ నాయుడు - కల్కి సీఈవోను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.