Begin typing your search above and press return to search.
ఏపీలో బస్సు ప్రమాదం.. షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 17 Dec 2021 4:00 PM ISTఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదానికి అసలు కారణాలు తెలిసాయి. జంగారెడ్డిగూడెం సమీపంలో డివైడర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిపోయింది. అశ్వారావుపేట నుంచి జంగారెడ్డిగూడెం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో బస్సు డ్రైవర్ చిన్నారావు, 9మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది మృతిచెందారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ప్రమాదానికి కారణంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రమాదంలో డ్రైవర్ పక్కనే కూర్చున్న గాయపడిన సోమశేఖర్ అనే వ్యక్తి అసలు నిజాలను బయటపెట్టాడు. బస్సు స్టీరింగ్ పట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. డ్రైవర్ ఎంత ట్రై చేసినా స్టీరింగ్ తిరగలేదని తెలిపాడు.
స్టీరింగ్ పట్టడంతో ఒకవైపు బస్సు వెళ్లిపోయిందన్న ప్రత్యక్ష సాక్షి.. బస్సు మెయింటనెన్స్ సరిగా లేదన్నారు. గతంలో కూడా ఈ బస్సుకు స్టీరింగ్ పట్టినట్లు చెబుతున్నారని.. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక జల్లేరు వద్ద బ్రిడ్జిపై రెయిలింగ్ లేకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా ప్రయాణికులు తెలిపారు. మొత్తంగా ప్రమాదానికి ఆర్టీసీ నిర్లక్ష్యం.. బస్సు అస్తవ్యస్థంగా ఉండడమే కారణమని తెలుస్తోంది.