Begin typing your search above and press return to search.
తమిళ రాజకీయాల్లో 'డైరీ' ప్రకంపనలు!
By: Tupaki Desk | 24 Dec 2016 11:32 AM GMTఏమాటకామాట చెప్పుకోవాలంటే ఏదైనా అవినీతి కేసుల్లో ఎవరైనా ఒక పెద్దతలకాయ పట్టుబడినట్లయితే ఆ దర్యాప్తులో కీలకపాత్ర వచిందేది ఒక డైరీ! అవును... ఏ భారీ కేసు పూర్వాపరాలు పరిశీలించినా ఆయా కేసుల్లో డైరీలు కూడా కీలక పాత్ర వహిస్తుంటాయి. కొన్ని నెలల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నయీం కేసులో కూడా డైరీదే కీలక పాత్ర అనేది తెలిసిన విషయమే. ఇప్పటికీ ఆ డైరీలో ఏముందనే విషయంమీద చాలా మందికి చాలా సందేహాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇదే క్రమంలో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు విషయంలోనూ డైరీ కీలక పాత్ర పోషించబోతుందనేది తెలుస్తుంది.
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు నివాసం - ఆఫీస్ లో ఐటీ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అక్రమాలు చేసినట్లు రామ్మోహన్ రావు ఇప్పటికే ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో సుమారు పదహారు కోట్లవరకూ పన్ను కట్టేందుకు ఆయన కుమారుడు వివేక్ కూడా అంగీకరించారు. అయితే అలా 16కోట్ల రూపాయలు పన్ను కట్టడంతోనే కథ ముగిసిపోలేదంటున్నారు ఐటీ అధికారులు. దీనికి కారణం దాడుల సమయంలో రామ్మోహన్ రావు నివాసంలో దొరికిన ఓ డైరీ.
అవును ఆ డైరీ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఐటీ అదికారులకు దొరికిన ఆ డైరీలో అన్నాడీఎంకే మంత్రులు - సీనియర్ నేతలు - ఐఏఎస్ - ఐపీఎస్ ల బాగోతాలున్నాయని, ఆ డైరీ ఆధారంగా మరింత లోతుగా దర్యాప్తు జరిగితే తమిళనాడులో కల్లోలమేనని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే సమయంలో రామ్మోహన్ రావు డైరీ దొరికిందన్న వార్తలలో తమిళనాట రాజకీయ నాయకులకే కాదు, అధికారులకు కూడా గుండేల్లో రైళ్లు పరిగెడుతున్నాయని తెలుస్తుంది.
ఈ విషయంలో అన్నాడీఎంకేలో ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన శశికళ, పన్నీర్ వర్గాలు కూడా తెగ ఆందోళన చెందుతున్నాయట. నిజంగా దొరికిన ఆ డైరీ విషయంలో ఐటీ అధికారులు రాజీపడకుండా చర్యలు తీసుకుంటే మాత్రం తమిళనాట జరిగే కళ్లోలం మామూలుగా ఉండకపోవచ్చు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/