Begin typing your search above and press return to search.
ఐటీ రిటర్న్స్ విషయంలో షాకింగ్ ఫ్యాక్ట్స్.. మోడీ సర్కారు ఏం చేస్తుంది?
By: Tupaki Desk | 16 Feb 2020 6:00 AM GMTదేశంలో ఐటీ రిటర్నులు సక్రమంగా దాఖలు చేస్తున్న వారి సంఖ్య చాలా చాలా తక్కువ అని అంటున్నాయి గణాంకాలు. ఒకవైపు భారతీయులు భారీగా ఖర్చు చేస్తూ ఉన్నారు, అందరూ కాకపోయినా కొందరు అత్యంత విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తూ ఉన్నారు, అయితే వారంతా ఇన్ కమ్ టాక్సులను మాత్రం సక్రమంగా చెల్లించడం లేదు, మోసం చేస్తున్నారనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అందుకు ఉదాహరణలను కూడా మోడీ సర్కారు పొందు పరుస్తూ ఉంది. ప్రస్తుతం దేశంలో సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయలకు మించి ఆదాయం సంపాదిస్తున్నట్టుగా చెబుతున్నది కేవలం 8,600 మంది మాత్రమేనట. ఇది పెద్ద అబద్ధమని అంచనా వేస్తోంది ఆర్థిక శాఖ. ఐదు కోట్ల రూపాయలు, అంతకు మించి ఆదాయం సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారని, అయితే కొందరు మాత్రమే ఆ విషయంలో వాస్తవాలను చెబుతున్నారని అంచనా.
అలాగే కనీసం కోటి రూపాయలకు మించి వార్షికాదాయాన్ని చూపుతున్న వారి సంఖ్య కేవలం 2,200 మంది మాత్రమేనట. ఇది కూడా అబద్ధమే అని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. దేశంలో చాలా మంది ఆదాయం కోటికి పైనే ఉందని అయితే వారిలో కొద్ది మంది మాత్రమే ఆ మేరకు పన్నులు చెల్లిస్తున్నారని ప్రభుత్వం అభిప్రాయపడుతూ ఉంది.
దేశంలో గత ఐదేళ్లలో 1.5 కోట్ల స్థాయిలో ఖరీదైన కార్లు అమ్ముడయ్యాయని, కోటి రూపాయలకు పై స్థాయి విలువ ఉన్న ఫ్లాట్లు లక్షల సంఖ్యలో అమ్ముడు పోయాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఆదాయం విషయంలో మాత్రం తక్కువ మంది ఆ స్థాయిని చూపుతున్నారట. అలాగే ఏడా మూడు కోట్ల మంది భారతీయులు ఏదో రకంగా విదేశీ పర్యటనలు చేస్తున్నారట! ఈ విలాసాలకూ ఐటీ రిటర్నుల్లో పేర్కొంటున్న వివరాలకూ ఏ మాత్రం సంబంధం లేదని మోడీ సర్కారు భావిస్తూ ఉంది. బహుశా మోడీ ప్రభుత్వం ఇప్పుడు వీరి పని పట్టడానికి రెడీ అవుతోందా అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయిప్పుడు.