Begin typing your search above and press return to search.
ఈ వైరస్ సోకితే మృత్యువే..ఆఫ్రికాలో కొత్త వైరస్..రష్యా హెచ్చరిక
By: Tupaki Desk | 31 Aug 2021 4:30 AM GMTప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా వైరస్ మహమ్మారి పీడ ఇప్పుడిప్పుడే తగ్గుతున్న తరుణం లో కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్ లు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా ప్రాణాంతకమైన వెస్ట్ నైల్ వైరస్ (డబ్ల్యూఎన్ వీ) పై రష్యా హెచ్చరించింది. రష్యాలో ప్రమాదకర వైరస్ గా మారిన వెస్ట్ నైల్ వైరస్ కి ఇంకా టీకా కానీ, మందులు కానీ లేదు. ఈ వ్యాధి వున్న దోమలు కుట్టడం ద్వారా ఇది మనుషులకు సోకుతుందట. రష్యాలో వెలుగు చూస్తున్న వెస్ట్ నైల్ కేసుల్లో 80 శాతానికి పైగా నైరుతి ప్రాంతంలోనే నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
దీంతో డబ్ల్యూఎన్ వీపై రష్యా తాజాగా ఆందోళనకర ప్రకటన చేసింది. ఈ వెస్ట్ నైల్ వైరస్ మరింత చెలరేగిపోయే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ దేశాలను హెచ్చరించింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వైరస్ ను దోమలు మోసుకెళ్లేందుకు అనువుగా ఉన్నాయని వెల్లడించింది. ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ తర్వాత యూరప్, ఆసియా, ఉత్తర అమెరికా దేశాలకు వ్యాప్తిచెందింది. ఇది సోకిన వ్యక్తులు తీవ్రమైన నరాల సంబంధ వ్యాధుల బారినపడతారు. ఇది దోమల ద్వారా మనుషులకు వ్యాపిస్తుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) తెలిపింది.
వెస్ట్ నైల్ కేసులు దోమల సీజన్ లోనే ఎక్కువగా సంభవిస్తాయని , వేసవిలో మొదలై చివరి వరకు ఉంటుంది. డబ్ల్యూఎన్ వీ సోకిన వ్యక్తుల్లో ప్రతి 150 మందిలో ఒకరు తీవ్ర అస్వస్థతకు గురవుతారు. తరచూ రోగాల బారినపడతారు. కీటక నాశిని ఉపయోగించడం, పొడవు చేతులున్న చొక్కా, కాళ్ల కింది వరకు ఉన్న ప్యాంటును ధరించడం ద్వారా కొంత వరకు రక్షణ పొందొచ్చు. వైరస్ సోకిన ప్రతి 10 మందిలో 8 మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరిలో తీవ్రమైన జ్వరంతోపాటు తలనొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, శరీరంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వైరస్ బారినపడిన వారిలో చాలా వరకు కోరుకుంటారు. అయితే, ఆ తర్వాత కొన్ని నెలలపాటు నీరసంగా ఉంటుంది. ఏ వయసు వారైనా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. 60 ఏళ్లు దాటిన వారికి మరింత ముప్పు ఉంటుందని సీడీసీ తెలిపింది. మరీ ముఖ్యంగా కేన్సర్, మధుమేహం, హైపర్ టెన్షన్, కిడ్నీ జబ్బులు, అవయమార్పిడి చేసుకున్న వారికి ముప్పు చాలా ఎక్కువని పేర్కొంది. ప్రస్తుతానికైతే ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి టీకాలు కానీ, చికిత్స కానీ అందుబాటులో లేదు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలి.