Begin typing your search above and press return to search.

మాజీ ప్రియులే కావాలి.. డేటింగ్ కోసం ఎగబడుతున్నారు

By:  Tupaki Desk   |   16 May 2020 11:30 PM GMT
మాజీ ప్రియులే కావాలి.. డేటింగ్ కోసం ఎగబడుతున్నారు
X
డేటింగ్ అన్నా సహజీవనం అన్నా.. పెళ్లి కాకుండా ఒక ఆడ మగ కలిసి జీవించడానికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా అర్థం అదే. నచ్చిన వాళ్లతో నచ్చినన్ని రోజులు గడిపేయడమే ఇందులో అర్థం పరమార్థం. ఒకరిపై ఒకరికి నమ్మకం, ప్రేమ బలపడితే పెళ్లి చేసుకుంటారు.. కుదరకపోతే బ్రేకప్ చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే మధ్యలో సర్వ సుఖాలు అనుభవిస్తారు.

అయితే తాజాగా ఒక కొత్త కోణం వెలుగుచూసింది. డేటింగ్ చేసి విడిపోయిన మాజీ ప్రియుడు, మాజీ ప్రియురాలు మళ్లీ డేటింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండడం కొత్త ట్రెండ్ గా మారింది. యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో మానసిక శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో చాలా మంది మాజీ ప్రియులు తమ మాజీ ప్రేయసితోనే మళ్లీ డేటింగ్ చేయాలని తెగ వెంపర్లాడుతున్నారని తెలిపారు. ఈ సీక్రెట్ పై పరిశోధన జరిపారు.

332 మంది జంటలపై సర్వే చేశారు. కొత్త వారితో కలవలేక విడిపోతున్నామని.. పాత ప్రియులు అయితే స్వభావంలో ఒకేలా ఉంటామని.. తమ అభిప్రాయాలను వారితో పంచుకునేందుకు ఈజీగా ఉంటుందని తెలిపారు. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయమని వారితో ప్రేమగా మసులుకుంటామన్నారు. అప్పుడు చేసిన తప్పులను మరోసారి చేయకుండా వారితో ప్రేమగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని తేల్చారు. అందుకే కొత్త వారితో కంటే పాత ప్రియురాలు/ ప్రియుడితోనే డేటింగ్ కు ఉత్సాహం చూపుతున్నారని పరిశోధనలో తేలింది.

కొత్తవారితో కలిసిపోయే సెట్ కావడం కష్టమని.. విభేదాలు వస్తున్నాయని.. అదే పాత వారితో అయితే మనసు విప్పి మాట్లాడి.. వారి అభిరుచులు తెలుసు కాబట్టి అలా నడుచుకుంటూ అన్ని విషయాల్లో సంతోషంగా గడపడానికి ఆస్కారం లభిస్తుందని జంటలు తెలిపాయి. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాత బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ తోనే మళ్లీ డేటింగ్ కు అందరూ ఆసక్తి చూపుతున్నట్టు తేలింది.