Begin typing your search above and press return to search.

షాకింగ్.. కరోనా ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్.. నలుగురు రోగులు సజీవ దహనం

By:  Tupaki Desk   |   18 April 2021 3:06 AM GMT
షాకింగ్.. కరోనా ఆసుపత్రిలో ఫైర్ యాక్సిడెంట్.. నలుగురు రోగులు సజీవ దహనం
X
కరోనా కేసులు పెరిగిపోయిన నేపథ్యంలో.. వారికి వైద్య సాయం అందించేందుకు.. ఐసోలేషన్ సౌకర్యం కోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్ని స్టార్ట్ చేశారు. హడావుడిగా ఏర్పాటు చేయటం.. భద్రతా పరమైన చర్యల్ని పాటించకుండా ఉండటంతో తరచూ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు మరణించారు. తాజాగా మరో దారుణ ఉదంతం చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.

ఆ రాష్ట్ర రాజధాని ఆసుపత్రిని కరోనా రోగుల కోసం కేటాయించారు. ఇందులో పెద్ద ఎత్తున కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు. శనివారం అనూహ్యంగా ఫ్యాన్ లో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకోవటం.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో.. ఆసుపత్రి మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో రోగులు పరుగులు తీశారు.

ఆసుపత్రుల్లోని రోగుల్ని బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినా.. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. నలుగురు కరోనా రోగులు మంటల్లోనే చిక్కుకుపోయారని.. సజీవ దహనమైనట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సామాన్యుల ప్రాణాలకు ఖరీదు కట్టే ప్రభుత్వాలు ఉన్నంత కాలం.. ఇలాంటి ప్రమాదాలు కొనసాగుతూనే ఉంటాయి. నిజానికి.. ఈ మరణాలకు బాధ్యులైన అధికారుల్ని గుర్తించి.. వారికి కఠిన శిక్షలు విధిస్తే.. వ్యవస్థలో మార్పు రాదంటారా? రోగం ఒక దగ్గర.. మందు మరో దగ్గర. మొత్తంగా బలయ్యేది మాత్రం సామాన్యులే కావటం అసలుసిసలు విషాదం.