Begin typing your search above and press return to search.

ఆ ఏడుగురు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్‌: కాంగ్రెస్‌లోకి న‌లుగురు, బీజేపీలోకి ముగ్గురా ?

By:  Tupaki Desk   |   21 Jan 2022 6:30 AM GMT
ఆ ఏడుగురు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు జంప్‌:  కాంగ్రెస్‌లోకి న‌లుగురు, బీజేపీలోకి ముగ్గురా ?
X
ప్ర‌భుత్వంలో ఉన్న ఏ పార్టీ అయినా.. తిరిగి అధికారం నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. మ‌ళ్లీ మ‌ళ్లీ అధికారంలోనే ఉండాల‌ని చూస్తుంది. అయితే.. ఇది సాకారం కావాలంటే.. ప్ర‌జ‌ల మ‌ధ్య అభిమానం నిల‌బెట్టుకునే తీరాలి. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప్ర‌య‌త్నం విఫ‌లం కావ‌డం ఖాయం. అందుకే.. కొన్ని నిర్ణ‌యాలు ఎంత క‌ఠినం అయినా.. తీసుకునేందుకు పార్టీలు వెనుకాడ‌వు. ఉదాహ‌ర‌ణ‌కు దేశంలో నే పెద్ద రాష్ట్రం ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌... యూపీలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఇక్క‌డ మ‌రోసారి అధికారం ద‌క్కించుకునేందుకు అధికార పార్టీ బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలోనే కొంత క‌ష్ట‌మేఏ అయిన‌ప్ప‌టికీ..ఏకంగా 20 మంది సిట్టింగుల‌కు సీట్లు కేటాయించ‌లేదు. దీనికి కార‌ణం.. వారిపై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త ఉండ‌డ‌మే. 20మంది పై ప్రేమ చూపిస్తే.. మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని గ్ర‌హించిన‌బీజేపీ ఆ 20 మందిని ప‌క్క‌న పెట్టింది. ఇలా.. తెలంగాణ‌లోనూ..కొంద‌రు ఎమ్మెల్యేల ను ప‌క్క‌న పెట్టాల‌ని. అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది వ‌చ్చే ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేందుకు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకుంటోంది. తెలంగాణ సాధించిన త‌ర్వాత‌.. వ‌రుస‌గా రెండు సార్లు అధికారం ద‌క్కించుకున్న టీఆర్ ఎస్ ఇప్పుడు.. మూడోసారి గెలిచి.. హ్యాట్రిక్ సాధించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది.

ఈ క్ర‌మంలో పార్టీలో ఎమ్మెల్యేల ప‌నితీరుపై అధికార పార్టీ స‌ర్వేలు చేయించింది. ఈ స‌ర్వేలో.. ఏడుగురు ఎమ్మెల్యేల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని పార్టీ అధిష్టానం గుర్తించింది. దీంతో ఈ ఏడుగురు ఎమ్మెల్యేల‌ను ప‌క్క‌న పెడ‌తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం వ్య‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న ఎమ్మెల్యేల జాబితా కేసీఆర్‌కు చేరింద‌ని.. ఈ జాబితాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని తెలుస్తోంది. అయితే.. వీరంతా సీనియ‌ర్లు కావ‌డం గ‌మ‌నార్హం. అయితే.. వారు మాత్రం ఊరుకుంటారా? త‌మ దారి తాము చూసుకునేందుకురెడీ అవుతున్నారు.

ఏ పార్టీకైనా పార్టీ ప్ర‌యోజ‌నం ఎంత ముఖ్య‌మో.. అదేస‌మ‌యంలో నాయ‌కుల‌కు కూడా వారి జీవితాలు, భ‌విత‌వ్యాలు.. రాజ‌కీయాలు అంతే ముఖ్యం. దీంతో కేసీఆర్ చేతికి అందిన జాబితాలో ఉన్న‌.. వ్య‌తిరేకుల జాబితాలో పేర్లు ఉన్న‌వారు.. వారి ప్ర‌య‌త్నాలు వారు చేస్తున్నార‌ని తెలుస్తోంది. మొత్తం ఏడుగురు వ్య‌త‌తిరేక‌త ఎక్కువ‌గా ఉన్న ఎమ్మెల్యేల్లో న‌లుగురు కాంగ్రెస్‌లోకి, ముగ్గురు బీజేపీకిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, కేసీఆర్‌ను వ్య‌తిరేకించ‌డ‌మే ముఖ్య‌మని భావిస్తున్న ఈ రెండు పార్టీలు కూడా.. వారిని చేర్చుకునేందుకు రెడీగా ఉన్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.