Begin typing your search above and press return to search.

షాకింగ్ః ధోనీకి ఇన్ని బిజినెస్ లు ఉన్నాయా?

By:  Tupaki Desk   |   13 Jun 2021 7:30 AM GMT
షాకింగ్ః  ధోనీకి ఇన్ని బిజినెస్ లు ఉన్నాయా?
X
‘మ‌హేంద్ర సింగ్ ధోనీ..’ క‌ఠిన స‌మ‌యాల్లో కూడా ప్ర‌శాంతంగా ఉంటూ.. ప‌దునైన వ్యూహాలు అమ‌లు చేసే బ‌ల‌మైన సార‌ధి. అయితే.. కేవలం క్రికెట్లోనే కాదు.. జీవితంలోనూ అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలనని నిరూపిస్తున్నాడు. ధోనీ విస్తరిస్తున్న వ్యాపార సామ్రాజ్యం గురించి తెలుసుకుంటే.. ఔరా అనాల్సిందే మ‌రి!

ధోనీ అంత‌ర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినప్ప‌టికీ.. ఐపీఎల్ లో కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఓ వైపు క్రికెట్ ను కొన‌సాగిస్తూనే.. మ‌రోవైపు బిజినెస్ మెన్ గానూ ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప‌లు విభిన్న రంగాల్లో ఆయ‌న పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం.

స్పోర్ట్స్ ఫిట్ వ‌ర‌ల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దేశ‌వ్యాప్తంగా 200 పైగా జిమ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేశాడు ధోనీ. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో వీటిని ఏర్పాటు ఏర్పాటు చేశారు.

ఇక‌, తాను క్రికెటర్ అయిన‌ప్ప‌టికీ.. బిజినెస్ ప‌రంగా ఇత‌ర క్రీడ‌ల‌ను ఎంచుకోవ‌డం విశేషం. ఇందులో ఒక‌టి ఫుట్ బాల్‌. ఇండియ‌న్ సూప‌ర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నీలో ఒక జ‌ట్టుకు ధోనీ య‌జ‌మానిగా ఉన్న సంగ‌తి తెలిసిందే. చెన్నైయిన్ ఎఫ్ సీ జ‌ట్టులో ధోనీకి పార్ట్ న‌ర్ షిప్ ఉంది. ఆ విధంగా ఫుట్ బాల్ జ‌ట్టుకు ఓన‌ర్ అయ్యాడు.

ఇదేవిధంగా మ‌రో క్రీడ‌లోనూ ధోనీ పెట్టుబ‌డులు పెడుతున్నాడు. అదే హాకీ. ఒక ఆట‌గాడిగా క్రీడ‌ల‌ను ఆస్వాదిస్తూనే.. ఓ బిజినెస్ మెన్ గా వ్యాపారం కూడా చేస్తున్నాడు మ‌హీ. రాంచీకి చెందిన హాకీ టీమ్ పై ధోనీ పెట్టుబ‌డి పెడుతున్నాడు.

మ‌రో క్రీడ.. కార్ రేసింగ్ బిజినెస్ లోనూ మ‌హీ దిగాడు. సూప‌ర్ స్పోర్ట్స్ వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ షిప్ లో మ‌హీకి రేసింగ్ టీమ్ ఉంది. ఈ టీమ్ యాజ‌మాన్యంలో టాలీవుడ్ హీరో నాగార్జున కూడా పార్ట్ న‌ర్ కావ‌డం విశేషం.

ఇక‌, హోట‌ల్ రంగంలోనూ ధోనీ ప్ర‌వేశించాడు. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. ధోనీ సొంత రాష్ట్ర‌మైన జార్ఖండ్ లో అత‌ని హోట‌ల్ ఉంది. దాని పేరు హోట‌ల్ మ‌హీ రెసిడెన్సీ. అయితే.. దీనికి ఇత‌ర ప్రాంతాల్లో ప్రాంచైజీలు ఏమీ లేవు. రాంచీలో ఒక హోట‌ల్ మాత్ర‌మే ఉంది. ఈ విధంగా.. త‌న‌లోని బిజినెస్ మెన్ ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చి.. త‌న వ్యాపార సామ్రాజ్యాన్ని విస్త‌రిస్తున్నాడు ధోనీ.