Begin typing your search above and press return to search.
ఇష్టంగా షవర్మా తినేసింది.. పాచిపోయింది కావడంతో ప్రాణాలు వదిలింది!
By: Tupaki Desk | 2 May 2022 8:29 AM GMTకలుషిత ఆహారం తిని ఓ 16 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మో 18 మంది వ్యాద్ఖులు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కేరళ లోని కాసర్ గోడ్ జిల్లాలో జరిగింది. అయితే ట్యూషన్ కేంద్రానికి సమీపంలో ఉన్న ఓ జ్యూస్ పాయింట్ లో వీరంతా షవర్మా తిన్నారు. అయితే అది పాచిపోయింది కావడంతో వీరందరికీ ఫుడ్ పాయిజన్ అయింది.
వెంటనే వాంతులు వంటివి అవడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కరివళ్లూర్ కు చెందిన దేవానంద(16)... కన్హాన్ గడ్ లోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ట్యూషన్ కేంద్రానికి వెళ్లిన బాలిక.. నచ్చిన ఆహారం తిని చనిపోవడం జీర్ణించుకోలేని తల్లిదండ్రులు... కన్నీరుమున్నీరవుతున్నారు. సాయంత్రానికి ఇంటికి వచ్చే కూతురు తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాలిక చావు తో పాటు మరో 18 మంది అస్వస్థతకు కారణం అయిన జ్యూస్ షాప్ పై కేసు నమోదు చేసి సీజ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. అయితే ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని వివరించారు.
అయితే వీరే కాకుండా ఇంకా చాలా మంది అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నట్లు పోలీసులు వివరించారు. చెరువతుర్ పీహెచ్ సీ, నీలేశ్వరమ్ తాలూక ఆసుపత్రికి సమీపంలోని వైద్యులు, మెడికల్ ఇన్ స్టిట్యూట్ కు సమాచారం అందించినట్లు స్పష్టం చేశారు.
స్వల్ప లక్షణాలు ఉన్న వారికి సహా అక్కడే చికిత్స అందించడం సహా తీవ్రంగా అస్వస్థతకు గురైన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాష్ట్ర మంత్రి ఎవీ గోవిందన్ పరామర్శించారు.
హోటళ్లలో నాణ్యమైన ఆహారం అందించేలా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.