Begin typing your search above and press return to search.

ఆమె గురించి తెలిసి అమెరికన్లకు కన్నీళ్లు అగట్లేదు.. తెలిస్తే మీకు వేదనే

By:  Tupaki Desk   |   1 Sep 2021 3:47 AM GMT
ఆమె గురించి తెలిసి అమెరికన్లకు కన్నీళ్లు అగట్లేదు.. తెలిస్తే మీకు వేదనే
X
ఆఫ్గనిస్తాన్ లో సైనిక విధులు నిర్వహించిన ఎందరో సైనికులు ఉన్న విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి వేళకు.. అమెరికన్ చివరి సైనికుడు ఆ దేశాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు. తాలిబన్ల రాకతో అఫ్గాన్ ప్రజల జీవితాలు మొత్తంగా మారిపోయాయి. గతానికి గుర్తు చేసే చీకటి రోజులు మొదలైనట్లుగా.. తాజాగా వస్తున్న వార్తల్ని విన్నంతనే అనిపించక మానదు. ఇదిలా ఉంటే.. అమెరికా సైనికుల పహరాలో ఇరవైఏళ్ల పాటు స్వేచ్ఛా ఊపిరి పీల్చుకున్న అఫ్గాన్లకు ఇప్పుడు తాలిబన్ల ఏలుబడి రోజులు తిరిగి వచ్చేశాయి.

దీనంతటికి ముందు.. అంటే.. కొద్ది రోజుల క్రితం ఒక అఫ్గాన్ పసికందును.. ఒక అమెరికన్ సైనికురాలు ఎత్తుకొని లాలిస్తున్న ఫోటో ఒకటి బయట ప్రపంచానికి తెగ నచ్చేసింది. ఈ ఫోటోకు క్యాప్షన్ కింద సదరు మహిళా సైనికురాలు తన సోషల్ మీడియా పేజీలో.. ‘నా ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నా’ అంటూ పేర్కొంది. ఫోటో మాత్రమే కాదు.. క్యాప్షన్ కూడా అదిరిపోయింది. ఎంతోమందిని కదిలించిన ఆ ఫోటో.. ఆ ఫోటోలోని సైనికురాలికి పెద్ద ఎత్తున అభినందనలు అందాయి.

కట్ చేస్తే.. తాజాగా ఈ మహిళా సైనికురాలు ఇంకెప్పటికి తిరిగి రాలేని లోకాలకు వెళ్లిపోయింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఎలా చోటు చేసుకుందన్న విషయానికి వస్తే. ఈ మధ్యన ఐసిస్ తీవ్రవాదులు కాబూల్ విమానాశ్రయం వద్ద జరిపిన ఆత్మాహుతి దాడిలో పలువురు మరణించటం తెలిసిందే. ఆ దాడిలోనే మరణించిన సైనికుల్లో ఆమె కూడా ఒకరన్న విషయం ప్రపంచానికి బయటకు వచ్చింది. ఇంతకీ ఆమె పేరేమిటి? అంటారా? అక్కడికే వస్తున్నాం. ఆమె పేరు సార్జెంట్ నికోల్ ఎల్ గీ. ఆమె భర్త కూడా మెరైన్ గా పని చేస్తున్నారు. ఆమె మరణం.. అమెరికన్లను తీవ్రంగా కదలించటమే కదు.. ప్రపంచం సైతం విషాదంలో మునిగిపోతోంది.

బాంబు దాడి జరగటానికి ఆరు రోజుల ముందు పోస్టు చేసిన ఆమె పోస్టు చూసిన ప్రతి ఒక్కరూ వేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే నికోల్ అంత్యక్రియలకు అయ్యే ఖర్చు కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నారు. రోజుల వ్యవధిలోనే 1.4లక్షల డాలర్లు చందాలుగా వచ్చాయి. ఆ మొత్తాన్ని నికోల్ అంత్యక్రియలకు.. ఆమె మిత్రులు.. కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆదా చేస్తున్నారు. అయినా.. దేశం కోసం ప్రాణాల్ని పణంగా పెట్టిన వారి అంత్యక్రియలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయటం మానేసి. అందరూ కలిసి క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఏమిటో అర్థం కాదు.