Begin typing your search above and press return to search.
మహమ్మారితో పెళ్లాం మరణించిందన్నాడు.. సీక్రెట్ గా చెక్ చేస్తే షాకింగ్ నిజం
By: Tupaki Desk | 29 Jun 2021 4:30 AM GMTదారుణ నేరం బయటకు వచ్చింది. షాకింగ్ గా మారిన ఈ సంచలన హత్య కేసు విషయాలు వింటే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటం ఖాయం. ప్రేమించి పెళ్లాడిన భార్యను దారుణంగా హతమార్చటం ఒక దుర్మార్గమైతే.. ఆ హత్యను డెల్టా ప్లస్ కారణంగా మరణించినట్లుగా నాటకం ఆడిన రియల్ విలన్ కమ్ భర్త ఉదంతమిది. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో సూట్ కేసులో కాలిన మృతదేహం సంచలనంగా మారింది. తాజాగా దీనికి సంబంధించిన మిస్టరీ మొత్తం బయటకు వచ్చేసింది. ఈ రియల్ క్రైం స్టోరీలో రీల్ కు మించిన ట్విస్టులు బోలెడన్ని ఉన్నాయి.
కడప జిల్లా బద్వేల్ కు చెందిన శ్రీకాంత్ రెడ్డికి చిత్తూరు జిల్లాకు చెందిన భువనేశ్వరిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భువనేశ్వరి హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగిని. కరోనా కారణంగా ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు రావటంతో ఆమె తిరుపతికి వచ్చింది. శ్రీకాంత్ రెడ్డితో పెళ్లి అయినప్పటి నుంచి దంపతులు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. దీంతో.. వారు తరచూ గొడవలు పడుతుంటారు.
ఈ నెల 22 నుంచి భువనేశ్వరి ఫోన్ పని చేయకపోవటంతో అనుమానం వచ్చిన ఆమె పుట్టింటి వారు శ్రీకాంత్ రెడ్డిని నిలదీశారు. ఆమెకు డెల్టా ప్లస్ వైరస్ సోకిందని.. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. అక్కడ ఆమె చనిపోవటంతో దహన క్రియలు పూర్తి చేసినట్లు చెప్పాడు. అతడు చెప్పిన మాటల్లో ఏమీ నమ్మేట్లుగా లేకపోవటంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ఇదిలా ఉండగా భువనేశ్వరి అక్క కుమార్తె మమత కర్నూలు జిల్లాలో ట్రైనీ ఎస్ఐగా పని చేస్తున్నారు. దీంతో ఆమె రహస్యంగా రంగంలోకి దిగి భువనేశ్వరి అపార్టు మెంట్ సీసీ కెమెరా ఫుటేజ్ ను చెక్చేశారు. అందులో జూన్ 22న తన కుమార్తెను తీసుకొని ఎర్రటి సూట్ కేస్ తో బయటకు వచ్చి.. ట్యాక్సీ ఎక్కిన సీన్లు కనిపించాయి. మరిన్ని సీసీ కెమేరా ఫుటేజ్ లను రహస్యంగా పరిశీలించగా.. సదరు సూట్ కేస్ ను రుయా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి తీసుకెళ్లినట్లుగా కనిపించింది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో.. తాను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. చంకలో బిడ్డను ఎత్తుకొని మరీ.. చనిపోయిన భార్యను కాల్చేసిన దుర్మార్గానికి అందరూ షాక్ తింటున్నారు. ఈ ఉదంతంపై మరిన్ని వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.