Begin typing your search above and press return to search.

భైంసా అల్లర్ల వేళ.. అక్కడే జరిగిన దారుణ ఘటన బయటకు రాలేదేం?

By:  Tupaki Desk   |   12 March 2021 11:30 AM GMT
భైంసా అల్లర్ల వేళ.. అక్కడే జరిగిన దారుణ ఘటన బయటకు రాలేదేం?
X
దాదాపు ఐదారు రోజుల క్రితం ఒక చిన్న విషయం భారీ గొడవకు దారి తీయటమే కాదు.. భైంసా మొత్తం ఉడికిపోయేలా చేసింది. దీంతో.. ప్రజల్నిబయటకు రానివ్వకుండా ఇంట్లోనే ఉండిపోయేలా చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున ఆంక్షలు విధించటమే కాదు.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవటానికి వెనుకాడటం లేదు. భైంసాలో జరిగిన ఘర్షణల్లో ప్రాణ. ఆస్తి నష్టం జరిగింది. ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది.

భైంసాలో చోటు చేసుకున్న అల్లర్ల హడావుడిలో.. అదే ప్రాంతంలో జరిగిన మరో దారుణ ఉదంతం పెద్దగా బయటకు రాలేదు. ఎప్పుడైతే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. గాంధీ ఆసుపత్రికి వచ్చారో.. అప్పుడు కానీ ఆ దారుణ ఉదంతం గురించి వివరాలు బయటకు రాలేదు. ఇంతకీజరిగిందేమంటే.. భైంసా మండలంలో నాలుగేళ్ల చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ ఘటన జరిగిన విషయాన్ని తెలుసుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు భైంసా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆసుపత్రి మూసి ఉండటంతో వారు నిర్మల్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ పోలీసు కేసు నమోదు అయితేనే చికిత్స చేస్తామని చెప్పటంతో.. రూరల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులుకేసు నమోదు చేసి.. బాధితుల్ని వారి ఇంటికి పంపేశారు. అయితే.. చిన్నారి ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా ఉండటంతో రాత్రికి రాత్రి మైదరాబాద్కు తీసుకొచ్చారు. ఈ క్రమంలో వైద్యం చేస్తున్న వైద్యులు.. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశామని.. అతడ్ని 24 గంటల్లో అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లుగా చెబుతున్నారు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అమానవీయ ఘటన బండి సంజయ్ పుణ్యమా అని వెలుగు చూసిందో తప్పించి.. పెద్దగా ఫోకస్ కాకపోవటం ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. భైంసా అల్లర్లవార్తల్లో పడి.. ఈ ఉదంతానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేదని చెప్పక తప్పదు.