Begin typing your search above and press return to search.

పురుషాంగాన్ని కోసేసిన మహిళ.. కారణం తెలిస్తే షాక్​ అవుతారు?

By:  Tupaki Desk   |   17 May 2021 7:30 AM GMT
పురుషాంగాన్ని కోసేసిన మహిళ.. కారణం తెలిస్తే షాక్​ అవుతారు?
X
వివాహేతర సంబంధాలు.. వాటి వల్ల హత్యలు, దారుణాలు ప్రతిరోజు ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రస్తుతం జరిగిన మాత్రం అందుకు భిన్నం. ఓ వివాహిత.. భర్తతో విడిపోయి వేరుగా ఉంటుంది. మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. అయితే వీరి రాసలీలలను అదే గ్రామానికి చెందిన మరోవ్యక్తి చూశాడు. దీంతో సదరు మహిళ ఆ వ్యక్తి పురుషాంగాన్నే కోసేసింది. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటుచేసుకున్నది. తమ వివాహేతర సంబంధం బయటపడుతుందన్న కారణంతో సదరు వివాహిత అతడి పురుషాంగాన్నే కోసేయడం సంచలనంగా మారింది.

అంతేకాక సదరు వివాహిత ఓ కట్టుకథను కూడా అల్లింది. తనపై ఆ వ్యక్తి లైంగికదాడికి యత్నించాడని అందుకే తాను పురుషాంగాన్ని కోసేశానని పోలీసులను నమ్మించేందుకు యత్నించింది. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. బీహార్​ కు చెందిన పవిత్రి అనే మహిళ కొంత కాలంగా భర్త కు దూరంగా ఉంటోంది. అయితే పవిత్రి పప్పు భగత్​ అనే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. వీళ్లిద్దరూ నిత్యం పొలాల్లో, రహస్య ప్రదేశాల్లో తిరుగుతూ ఎంజాయ్​ చేసేవారు అయితే.. వీరు ఇటీవల ఓ పొలంలో ఎంజాయ్​ చేస్తుండగా.. హరేంద్ర మంఝీ అనే వ్యక్తి వీరిని చూశాడు. దీంతో సదరు మహిళ షాక్​ కు గురయ్యింది.

అతడి ద్వారా తమ వివాహేతర సంబంధం అందరికీ తెలిసి పోతుందని భావించి.. పవిత్రి దారుణానికి పాల్పడింది. ఓ పదునైన ఆయుధంతో అతడి పురుషాంగాన్ని కోసేసింది. దీంతో స్థానికులు గమనించి హరేంద్ర మంఝీ ని ఆస్పత్రికి తరలించారు. మాంఝీ భార్య పాస్పతి ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నారు.

అయితే తొలుత పవిత్రి ఓ కట్టు కథను అల్లింది. మాంఝీ తనను లైంగికం గా వేధించాడని.. లైంగికదాడికి యత్నించాడని అందుకే అతడి పురుషాంగాన్ని కోసేసినట్టు చెప్పుకొచ్చింది. అయితే పవిత్రి వ్యవహారంపై పోలీసులకు డౌట్​ వచ్చింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. మరోవైపు మాంఝీ భార్య ఫిర్యాదును కూడా పరిగణనలోకి తీసుకొని విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది.తమ వివాహేతర సంబంధం బయటపడుతుందన్న భయంతో ఓ వ్యక్తి పురుషాంగాన్నే కోసేయడం చర్చనీయాంశం అయ్యింది.